/rtv/media/media_files/2025/08/30/school-girl-delivery-2025-08-30-16-50-29.jpg)
School Girl Delivery
School Girl Delivery:
కర్ణాటకలోని(Karnataka) యాద్గిర్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. 9వ తరగతి చదువుతున్న ఒక బాలిక పాఠశాలలోని వాష్‌రూంలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం బుధవారం మధ్యాహ్నం జరగ్గా, గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
యాద్గిర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బాలిక, శిశువు ఇద్దరూ ప్రస్తుతం షాహాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
In a shocking incident in #Yadgir, a 17-year-old #student at a government residential #school gave birth in the #school restroom, highlighting severe negligence by the staff.
— The Times Of India (@timesofindia) August 29, 2025
Details here 🔗https://t.co/QbVzNmsPdn#Karnatakapic.twitter.com/XMQG2CNfd5
ఈ ఘటనపై అధికారులు సీరియస్‌గా స్పందించారు. పాఠశాల ప్రిన్సిపాల్, ఇతర సిబ్బందిపై కోర్టు సుమోటో కేసు నమోదు చేసింది. ఈ సంఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తుకు కోర్టు ఆదేశించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Also Read: ప్రసాదం పెట్టలేదని పిడిగుద్దులు గుద్ది, కర్రలతో కొట్టి చంపిన యువకులు! వీడియో వైరల్
కర్ణాటక యాద్గిర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. విద్యార్థుల భద్రత, పాఠశాలల్లో పర్యవేక్షణ తీరుపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ దుర్ఘటనపై పూర్తి దర్యాప్తు చేసి, బాధ్యులను శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.