/rtv/media/media_files/2025/12/18/supreme-court-2025-12-18-20-49-15.jpg)
Supreme Court
తెలంగాణలోని భూములకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. హైదరాబాద్‌లోని వనస్థలిపురం సమీపంలో సాహెబ్‌నగర్ వద్ద ఉన్న రూ.15 వేల కోట్ల విలువైన భూములు తెలంగాణ అటవీశాఖదేనని స్పష్టం చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. సాహెబ్‌నగర్ వద్ద ఉన్నటువంటి 102 ఎకరాల భూమిపై దాదాపు 20 ఏళ్లుగా వివాదం కొనసాగుతోంది. ఈ భూమిపై యాజమాన్య హక్కుల కోసం నిజా, సాలార్‌జంగ్, మీరాలం వారసులమని పేర్కొంటూ 260 మంది గతంలో హైకోర్టులో పిటిషన్లు వేశారు.
Also Read: MPTC, ZPTC, మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్ సంచలన ప్రకటన!
వాటిపై విచారించిన కోర్టు 260 మందికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టిల ధర్మాసనం ఈ పటిషన్‌పై సుధీర్ఘ విచారణ జరిపింది. చివరికి ఆ 102 ఎకరాలు పూర్తిగా అటవీభూమి అని పేర్కొంది. వీటికి సంబంధించిన పూర్తి హక్కులు రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటాయని తీర్పునిచ్చింది. 8 వారాల్లోగా ఆ భూములను రిజర్వ్ ఫారెస్ట్‌గా నోటిఫై చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు నోటిఫికేషన్ ప్రతిని సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి పంపించాలని చెప్పింది.
Also Read: ఓలా, ఊబర్ లకు టాటా..బైబై.. జనవరి నుంచి ఢిల్లీలో భారత్ ట్యాక్సీ
Follow Us