తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడుతల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీయే అత్యధిక స్థానాల్లో గెలుపొందింది. ఈ నేపథ్యంలోనే తాజగా సీఎం రేవంత్ రేవంత్ దీనిపై మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌కు అండగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. '' పంచాయతీ ఎన్నికలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాం. ప్రజాపాలనకు రెండేళ్ల సంబరాలు జరుపుకున్నాం. ఇదే సమయంలో సర్పంచ్ ఎన్నికలు అద్భుత ఫలితాలు ఇచ్చాయి. మా ప్రభుత్వంపై ప్రజలు సంపూర్ణ విశ్వాసం చూపించారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై వివిధ రకాలుగా విశ్లేషణలు జరుగుతున్నాయి.
మొత్తం 12,702 స్థానాలకు 7,527 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. 808 స్థానాల్లో కాంగ్రెస్ రెబల్స్ గెలిచారు. మొత్తంగా 8,335 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. కొన్ని గ్రామాల్లో బీఆర్ఎస్-బీజేపీ కూటమి కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేశాయి. ఈ రెండు పార్టీలు కలిసి 4221 స్థానాల్లో గెలిచాయి. సర్పంచ్ ఎన్నికల్లో రెబల్స్‌తో కలిపి మొత్తం 66 శాతం కాంగ్రెస్ గెలిచింది. బీఆర్‌ఎస్-బీజేపీ కలిసి 33 శాతం స్థానాల్లో గెలిచాయి. కాంగ్రెస్ గెలిచిన అసెంబ్లీ స్థానాలతో పాటు మరో 21 నియోజకవర్గాల్లో ప్రజలు కలిసి మా వైపు ఓటు నిలిచారు. రెండేళ్లలో జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా ప్రజలు మమ్మల్ని ఆదరించారు. పట్టణాలు, గ్రామాల్లో అన్ని వర్గాల ప్రజల నుంచి మాకు ఆదరణ లభించింది. మేము ప్రవేశపెట్టిన పథకాల పట్ల ప్రజలు పూర్తిగా సంతృప్తితో ఉన్నాయి. భవిష్యత్తులో బీజేపీ-బీఆర్‌ఎస్ కలిసి పోటీ చేయబోతున్నాయి. ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా కాంగ్రెసే గెలుస్తుంది.
రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డుల జారీ, సన్నబియ్యం పంపిణీ, రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నధాన్యానికి బోనస్ చెల్లింపు, ఉచిత కరెంట్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, రూ.500 లకే సిలిండర్, 27 వేల కోట్ల రూపాయల మేరకు సున్నా వడ్డీకే మహిళా సంఘాలకు రుణాలు, 4.5 లక్షల మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందిస్తున్నాం. అధికారం చేపట్టిన మొదటి ఏడాదిలోనే 61 వేల ఉద్యోగాల భర్తీ చేపట్టాం. సుదీర్ఘకాలం అపరిష్కృతంగా ఉన్న ఎస్సీ వర్గీకరణ సమస్యకు పరిష్కారం చేసి చూపించాం. వందేళ్లుగా జరగని బీసీ కులగణన చేపట్టాం. 2029లో కాంగ్రెస్ 2/3 మెజార్టీతో అధికారంలోకి వస్తుందని'' సీఎం రేవంత్ ఆశాభావం వ్యక్తం చేశారు.అలాగే కృష్ణా, గోదావరి జలాలపై తెలంగాణ హక్కులకు సంబంధించి పూర్తి వివరాలతో అసెంబ్లీలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. అన్ని పార్టీల అభిప్రాయం మేరకు MPTC, ZPTC, మున్సిపల్ ఎన్నికలపై నిర్ణయానికి వస్తామన్నారు.
MPTC, ZPTC, మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్ సంచలన ప్రకటన!
సర్పంచ్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీయే అత్యధిక స్థానాల్లో గెలుపొందింది. ఈ నేపథ్యంలోనే తాజగా సీఎం రేవంత్ రేవంత్ దీనిపై మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌కు అండగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.