/rtv/media/media_files/2025/12/18/bharat-taxi-2025-12-18-18-38-46.jpg)
భారత్ లో క్యాబ్ లు ఎంత సర్వసాధారణమై పోయాయో అందరికీ తెలిసిందే. నగరాల్లో విపరీతంగా పెరిగిపోయిన ట్రాఫిక్ ను తట్టుకోలేక చాలా మంది డ్రైవింగ్ లు మానేసి క్యాబ్ లను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఓటా, ఊబర్, ర్యాపిడూ వంటి సర్వీసులకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. దీన్ని అదనుగా తీసుకుని ఆ సర్వీసులన్ని విపరీతమైన ఛార్జీలను పెంచేశాయి. దానికి తోడు తమకు నచ్చినట్టు రూల్స్ ను మార్చేసుకున్నాయి. దీని కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కోసారి క్యాబ్ బుక్ అవుతుందో లేదో, అయినా వస్తుందో రాదో తెలియని పరిస్థితి కూడా ఎదురౌతోంది. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ మద్దతు భారత్ ట్యాక్సీ అనే సర్వీసును తీసుకువస్తోంది సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్.
యూజర్ ఫ్రెండ్లీ యాప్..
జీరో కమిషన్ మోడల్ తో కొత్త యాప్ ను తీసుకువస్తున్నారు. ఓలా, ఊబర్, ర్యాపిడోలకు ప్రత్యామ్నాయంగా దీనిని రూపొందించారు. భారత్ ట్యాక్సీ ను జీరో-కమిషన్ మోడల్ తో తీసుకు వస్తున్నారు. కార్లు, ఆటో-రిక్షాలు, బైక్‌లు అన్నీ ఈ సేవ ద్వారా అందుబాటులో ఉంటాయి. ఇది ఆండ్రాయిడ్ , iOS రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు మామూలు క్యాబ్ సర్వీసుల్లోనే తమ మొబైల్ నంబర్‌తో నమోదు చేసుకోవచ్చు. వారి పికప్, డ్రాప్-ఆఫ్ స్థానాలను నమోదు చేయవచ్చు, రైడ్‌ను ఎంచుకోవచ్చు. అలాగే తమ ప్రయాణాలను కూడా ట్రాక్ చేసుకోవచ్చును. భారత్ ట్యాక్సీ యాప్ యూజర్ ఫ్రెండ్లీ మొబైల్ బుకింగ్, పారదర్శక ఛార్జీల నిర్మాణం, రియల్-టైమ్ వెహికల్ ట్రాకింగ్, బహుభాషా ఇంటర్‌ఫేస్, 24x7 కస్టమర్ సపోర్ట్ వంటి వాటిని అందిస్తోంది. భారత్ ట్యాక్సీని మొట్టమొదటగా ఢిల్లీలో ప్రారంభించనున్నారు. జనవరి 1 నుంచి ఈ క్యాబ్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.
డ్రైవర్లకూ అధిక రాబడి..
భారత్ టాక్సీ యాప్ మోడల్ డ్రైవర్లకు సౌకర్యవంతంగా ఉంటుందని చెబుతున్నారు. ఇది డ్రైవర్ యాజమాన్యంలోని సహకార వ్యవస్థపై ఆధారపడి ఉంటుందని...దాని వలన డ్రైవర్లకు అధిక ఆదాయం, మెరుగైన పని పరిస్థితులను అందిస్తుందని తెలుస్తోంది. డ్రైవర్లు ఛార్జీలో 80 శాతం వరకు నేరుగా పొందుతారు. దీని కోసం ప్రత్యేకంగా నెలవారీ క్రెడిట్ వ్యవస్థను నిర్మించినట్లు వర్గాలు తెలిపాయి. ఈ ప్లాట్‌ఫామ్ డ్రైవర్లకు ప్రైవేట్ కంపెనీలపై ఆధారపడకుండా స్వతంత్ర, సమానమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. భారత్ ట్యాక్సీలో ఇప్పటి వరకు 56 వేలమంది డ్రైవర్లు నమోదు చేసుకున్నారని తెలుస్తోంది. ఢిల్లీ తరువాత రాజ్ కోట్, గుజరాత్ లలో...తరువా మిగతా నగరాల్లో విస్తరించనున్నారు.
Follow Us