/rtv/media/media_files/2025/04/14/YYXETHXM7ZI451l6fU75.jpg)
TG Cabinet Expansion Komatireddy Revanth Reddy
Cabinet expansion : రాష్ట్ర కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. నిజానికి ఈరోజు కేబినెట్ విస్తరణపై ఒక నిర్ణయం వెలువడుతుందని అందరూ భావించారు. ఎవరెవరికీ మంత్రులుగా అవకాశం వస్తుందనే దానిపై రేపు క్లారిటీ వస్తుందని పార్టీ నాయకులంతా ఆశగా ఎదురు చూశారు. కానీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బిజీబిజీగా ఉండటంతో మంత్రి వర్గ విస్తరణ రేపు ఉండకపోవచ్చని తెలుస్తోంది. కాకపోతే పీసీసీ కార్యవర్గంపై మాత్రం ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. కాకపోతే ఈ విషయంపై చర్చించడానికి పార్టీ ముఖ్యనేతలు అందుబాటులో లేరని తెలుస్తోంది. ఈ విషయమై చర్చించడానికి ఢిల్లీలో రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ బిజీబిజీగా గడుపుతున్నారు.
Also Read : BJP Leader Video viral: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే
చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తున్న మంత్రివర్గ విస్తరణ, పార్టీ పదవులపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. దీంతో రేవంత్, మహేశ్ కుమార్ వరుసగా కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉన్నాయి. ఆ పదవులకోసం చాలా మందే ఆశావాహులు క్యూలో ఉన్నారు. కొత్తగా మంత్రివర్గంలో చోటు ఎవరికీ దక్కుతుందనే విషయం మాత్రం స్పష్టత లేదు. రేసులో వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్ వెంకటస్వామి, రాజగోపాల్ రెడ్డి, పీ సుదర్శన్ రెడ్డి పేర్లు వినిపిస్తుండగా ప్రస్తుతం ఎమ్మెల్సీ, సినీనటి విజయశాంతి పేరు కూడా తెరమీదకు వచ్చింది. మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి తనకు కేటాయించాలని ఆమె అధినాయకత్వాన్ని కోరుతున్నట్టు సమాచారం. అయితే మహిళల కోటాలో ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఉండటంతో ఆమెకు అవకాశం దక్కదన్న ప్రచారం సాగుతోంది.
Also read: Cinema News: పవన్‌పై కుట్రతోనే థియేటర్ల మూసివేత.. ఆ నలుగురే ఇదంతా చేస్తున్నారా!?
నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనడానికి డిల్లీవెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి మూడు రోజులుగా అక్కడే ఉన్నారు. నిన్న సాయంత్రం కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా కలిశాడు. ఈ సందర్భంగా రాష్ర్ట రాజకీయాలతో పాటు పీసీసీ కార్యవర్గం కూర్పుపై చర్చించినట్లు సమాచారం. అయితే రాష్ట్ర కేబినెట్ పై ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చిందని ప్రచారం సాగుతోంది. అయితే రాహుల్ ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. ఆయన వచ్చి ఫైనల్ చేస్తే ఆ ఆరుగురు ఎవరో అనేది ఫైనల్ కానుంది.
మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఢిల్లీలో లేకపోవడంతో తెలంగాణ పీసీసీ కార్యవర్గ నిర్ణయం వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ నెల 30 మరోసారి ఢిల్లీ రావాలని సీఎం రేవంత్‌రెడ్డి, మహేశ్‌కుమార్ గౌడ్‌కు అధిష్ఠానం సూచించడంతో వారు హైదరాబాద్ బయలు దేరినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన కేబినెట్‌లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం ఉండాలని కోరినట్లు చెప్పారు. కేబినెట్ కూర్పుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని రాహుల్ చెప్పారన్నారు. రాష్ట్రానికి సంబంధించి కొన్ని విషయాలపై చర్చించినట్లు తెలిపారు.
ఇది కూడా చూడండి: Spirit Movie: దీపికా ఔట్.. యానిమల్ బ్యూటీ ఇన్.. ప్రభాస్‌తో రొమాన్స్‌కి బోల్డ్ బ్యూటీ
Also read: Pawan : మీకో దండంరా బాబు.. టాలీవుడ్ పై పవన్ ఫైర్!
Follow Us