/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం(Bus Accident) జరగకముందే మరో ఘోరం జరిగింది. హైదరాబాద్ ORRపై ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. మియాపూర్ నుంచి గుంటూరుకు 20 మంది ప్రయాణికులతో వెళ్తున్న న్యూ గో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురి ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. . వరుసగా బస్సు ప్రమాదాలు చోటుచేసుకోవడంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది.
ఓవర్‌టేక్ చేయబోయి
మరోవైపు ఏపీలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు(private-travels-bus) ప్రమాదానికి గురైంది. నెల్లూరులో లారీని ఓవర్‌టేక్ చేయబోయి ఐరన్ బారికేడ్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ సంఘటన నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం కొత్తూరు జాతీయ రహదారి వద్ద చోటుచేసుకుంది. ఐరన్ బారికేడ్ లేకపోతే బస్సు పల్టీ కొట్టే ప్రమాదం ఉండేది.
Also Read: 'బాహుబలి: ది ఎపిక్'కు కళ్లు చెదిరేలా హైదరాబాద్ బుకింగ్స్..!
ఈ ప్రమాద సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లతో పాటు 34మంది ప్రయాణికులన్నారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులంతా ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే బస్సులోని ప్రయాణికులను ఇతర వాహనాల్లో తరలించారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
/rtv/media/member_avatars/2025/05/07/2025-05-07t015022634z-vamshi.jpg )
 Follow Us
 Follow Us