Allu Arjun: మైండ్ బ్లోయింగ్ .. రిషబ్ శెట్టి 'కాంతారా' ను ఆకాశానికెత్తిన అల్లు అర్జున్! పోస్ట్ వైరల్

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి నటించిన లేటెస్ట్ మూవీ 'కాంతారా చాప్టర్ 1' బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రేక్షకుల నుంచి సినీ విశ్లేషకులు, సెలబ్రెటీల వరకు అంతా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.

New Update
kantara chapter 1 allu arjun tweet

kantara chapter 1 allu arjun tweet

Allu Arjun: కన్నడ స్టార్ రిషబ్ శెట్టి నటించిన లేటెస్ట్ మూవీ 'కాంతారా చాప్టర్ 1' బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రేక్షకుల నుంచి సినీ విశ్లేషకులు, సెలబ్రెటీల వరకు అంతా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ సినిమాను ప్రశంసిస్తూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. నిన్న రాత్రి కాంతారా సినిమా చూశాను. వావ్ ఎంత అద్భుతమైన సినిమా అనిపించింది. సినిమా చూస్తూ ఒక ట్రాన్స్ లో ఉండిపోయాను! రచయితగా, దర్శకుడిగా, నటుడిగా వన్ మ్యాన్ షో చేసిన రిషబ్ శెట్టికి అభినందనలు. ఆయన ప్రతీ క్రాఫ్ట్ లోనూ రాణించారు. రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య ఇతర నటీనటుల ప్రదర్శనలు చక్కగా ఉన్నాయి.   సాంకేతిక నిపుణులు కూడా అద్భుతంగా పనిచేశారు. ముఖ్యంగా అజినీష్ సంగీతం, అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫీ ధరణి ఆర్ట్ డైరెక్షన్, స్టెంట్ మాస్టర్ అర్జున్ రాజ్, నిర్మాత విజయ్ కిరంగదురు మొత్తం చిత్రబృందానికి హృదయపూర్వక అభినందనలు అని తెలిపారు. నిజాయితీగా చెప్పాలంటే సినిమాను వర్ణించడానికి మాటలు సరిపోవడం లేదు అంటూ కాంతారా సినిమాను ఆకాశానికెత్తారు హీరో అల్లు అర్జున్. 

Also Read: Rakul: రెడ్ డ్రెస్ లో సోషల్ మీడియాను హీటేక్కిస్తున్న బ్యూటీ.. రకుల్ ఫొటోలు చూస్తే ఫ్లాట్!

Advertisment
తాజా కథనాలు