Baahubali Bookings: బాహుబలి: ది ఎపిక్‌ కు కళ్లు చెదిరేలా హైదరాబాద్‌ బుకింగ్స్..!

ప్రభాస్‌, రాజమౌళి కాంబోలో వస్తున్న 'బాహుబలి: ది ఎపిక్' హైదరాబాద్‌లో అడ్వాన్స్‌ బుకింగ్స్‌ జోరుగా సాగుతున్నాయి. గంటకు 5 వేలకుపైగా టికెట్లు అమ్ముడవుతున్నాయి. 3 గంటల 44 నిమిషాల నిడివితో తెరకెక్కిన ఈ పాన్‌ ఇండియా చిత్రం, భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమవుతోంది.

New Update
Baahubali Bookings

Baahubali Bookings

Baahubali Bookings: ఎస్‌.ఎస్‌. రాజమౌళి(SS Rajamouli) దర్శకత్వంలో రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌(Prabhas) హీరోగా నటించిన ‘బాహుబలి: ది ఎపిక్‌’(Baahubali The Epic) సినిమాపై భారీ క్రేజ్‌ నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా అమెరికాలో ప్రారంభమైన అడ్వాన్స్‌ బుకింగ్స్‌ రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. ట్రేడ్‌ వర్గాల అంచనా ప్రకారం, ప్రీమియర్‌ షోల ద్వారా ఈ సినిమా 1 మిలియన్‌ డాలర్లకు పైగా వసూలు చేసే అవకాశం ఉంది.

బుక్‌ మై షోలో ట్రెండింగ్‌..

ఇక హైదరాబాద్‌ నగరంలో కూడా బుకింగ్స్‌ మొదలయ్యాయి. కొన్ని ఎంపిక చేసిన థియేటర్లు మాత్రమే టికెట్లు విడుదల చేసినా, ప్రేక్షకుల బుకింగ్స్  అద్భుతంగా ఉన్నాయి. బుక్‌ మై షోలో ఈ సినిమా ప్రస్తుతం హౌర్లీ ట్రెండింగ్‌ లిస్టులో ఉంది. గంటకు 5 వేలకుపైగా టికెట్లు అమ్ముడవుతున్నాయని సమాచారం. మరిన్ని థియేటర్లు బుకింగ్స్‌ ప్రారంభిస్తే, ఈ సంఖ్య మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.

మూడు గంటల 44 నిమిషాల నిడివితో రూపొందిన ఈ చిత్రాన్ని అన్ని ప్రధాన ఫార్మాట్లలో విడుదల చేస్తున్నారు. దాదాపు పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ అవుతున్న ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది.

సినిమాలో ప్రభాస్‌తో పాటు రానా దగ్గుబాటి, సత్యరాజ్, రమ్యకృష్ణన్, అనుష్క శెట్టి, తమన్నా భాటియా, నాసర్‌ తదితర ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతం మాస్ట్రో ఎం.ఎం. కీరవాణి అందించారు.

ఈ సినిమా విడుదలకు ముందే హైప్‌ ఊహించని స్థాయికి చేరింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన గత సినిమాలు సృష్టించిన రికార్డులను దృష్టిలో ఉంచుకుంటే, ‘బాహుబలి: ది ఎపిక్‌’ కూడా భారీ కలెక్షన్లు సాధించనుందని ట్రేడ్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also Read: కారుతో గుద్ది పరార్.. బిగ్ బాస్ నటి పై పోలీస్ కేసు!

రాబోయే రోజుల్లో మరిన్ని థియేటర్లు బుకింగ్స్‌ ఓపెన్‌ చేయనుండగా, టికెట్లు దొరకడం కష్టమవుతుందని ఫ్యాన్స్‌ చెబుతున్నారు. హైదరాబాద్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఉత్తర భారత రాష్ట్రాల్లో కూడా బుకింగ్స్‌ ప్రారంభం కావడంతో సినిమా సందడి మొదలైపోయింది.
‘బాహుబలి: ది ఎపిక్‌’ కేవలం సినిమా మాత్రమే కాదు, భారత సినీ పరిశ్రమను మరోసారి ప్రపంచస్థాయిలో నిలబెట్టే విజువల్‌ వండర్‌గా నిలుస్తుందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు