Srilanka : శ్రీలంకలో పవర్ కట్.. అంధకారంలో దేశ ప్రజలు
శ్రీలంకలో విద్యుత్ వ్యవస్థ స్తంభించిపోయింది. దేశమొత్తం కరెంట్ ఆగిపోవడంతో అక్కడి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక సమస్య వల్లే కరెంట్ ఆగిపోయినట్లు శ్రీలంక విద్యుత్ సంస్థ సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ తెలిపింది. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొంది.