/rtv/media/media_files/2025/12/03/fotojet-2025-12-03t122745420-2025-12-03-12-28-14.jpg)
Hyderabad Industrial Lands Transformation (HILT) Policy
HILT Policy : హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ (HILT) పాలసీ తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచుతోంది. ORR(outer-ring-road) లోపల ఉన్న ఇండస్ట్రియల్ పార్కుల్లోని 9వేల 292 ఎకరాలను మల్టీయూజ్ జోన్లుగా మార్చుతామని, దీని వల్ల రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం వాదన ఇలా ఉంటే.. ప్రతిపక్షాల వెర్షన్ మరోలా ఉంది. భూమిని తక్కువ ధరకు అమ్మేస్తున్నారని, 5లక్షల కోట్ల స్కామ్ జరుగుతోందని బీఆర్ఎస్(brs), బీజేపీ(bjp) తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. అంతేకాదు దీనిపై గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేశాయి. - Telangana Govt News
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఔటర్ లోపల నిరూపయోగంగా ఉన్న పారిశ్రామిక భూములు, కాలుష్య కారక పరిశ్రమలను తరలిస్తే ఖాళీగా ఉండే భూముల విషయంలో ఇటీవల (HILT)- హిల్ట్ పాలసీని తీసుకువచ్చింది.హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ (HILT)-2025 వల్ల రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు మంచి అవకాశం ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ లోపలి, సమీపంలో ఉన్న 9,292 ఎకరాల పాత ఇండస్ర్టీయల్ ల్యాండ్‌ను రెసిరెన్సియల్,కమర్షియల్, ఐటీ, మల్టీయూజ్ జోన్‌లుగా మార్చేందుకు ఈ పాలసీ అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు.
Also Read : శబరిమల భక్తులకు గుడ్ న్యూస్.. తెలంగాణ నుంచి పది ప్రత్యేక రైళ్లు..
కాలుష్యం తగ్గించేందుకు ..
ఈ పాలసీని కాంగ్రెస్ ప్రభుత్వం నవంబర్ 22వ తేదీన తీసుకొచ్చింది. దీని ద్వారా ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోపల ఉన్న 22 పారిశ్రామిక పార్కులు, ఎస్టేట్లలోని 9,292 ఎకరాల భూములను.. మల్టీ-యూజ్ జోన్లుగా మార్చాలని ప్లాన్ చేసింది. అంటే.. ఈ భూములను పారిశ్రామిక అవసరాల కోసమే కాకుండా.. అనేక విధాలుగా వాడుకునేందుకు వీలవుతుంది. ఈ పాలసీ లో భాగంగా ORR లోపల ఉన్న పరిశ్రమలను ORR బయటకు తరలిస్తారు. తద్వారా హైదరాబాద్‌లో కాలుష్యం తగ్గుతుంది అని ప్రభుత్వం చెబుతోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనను ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది.. తాజాగా పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్‌కుమార్ జీవో కూడా విడుదల చేశారు. ఓఆర్‌ఆర్ లోపల, సమీపంలో మొత్తం 22 పారిశ్రామికవాడల్లో 9,292.53 ఎకరాల భూమిని గుర్తించారు... ఇందులో చదును చేసినది 4,740.14 ఎకరాలుగా ఉంది. పారిశ్రామిక ప్రాంతాల వారీగా టీజీఐఐసీ గజం రేటు ఎంత ఉంది.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్(ఎస్‌ఆర్‌వో) రేటు ఎంత ఉంది అనే విషయాన్ని కూడా జీవోలో పేర్కొన్నారు. ఈ నూతన పాలసీని ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చింది.. దీనివల్ల కలిగే ప్రయోజనాలేమిటి.. మార్గదర్శకాలు ఏమిటి.. తదితరాలను ఈ ఉత్తర్వుల్లో వివరించారు.
బహుళ వినియోగ జోన్లుగా..
పూర్వం నగరం బయట ఏర్పాటు చేసిన పారిశ్రామిక ఎస్టేట్లు, పార్కులు.. ఇప్పుడు నగరం మధ్యలోకి చేరాయి. వీటి వలన పర్యావరణ, సామాజిక-ఆర్థిక సమస్యలు తీవ్రమవుతున్నాయి. వీటిని పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం హిల్ట్ పాలసీని ఆమోదించింది. ఈ విధానంతో పాత పరిశ్రమల స్థానంలో కొత్త జీవనశైలి, వాణిజ్య కేంద్రాలు రాబోతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. అవుటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్) లోపల, సమీపంలో ఖాళీగా ఉన్న, ఆర్థికంగా నష్టాల్లో ఉన్న పారిశ్రామిక భూములను బహుళ వినియోగ జోన్లు(మల్టీ యూజ్ జోన్స్)గా మార్చడం ఈ పాలసీ లక్ష్యం. ఇక్కడ రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్లు, ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లు, కమర్షియల్ ఆఫీసులు, రిటైల్ సెంటర్లు, హోటళ్లు, స్కూళ్లు, ఆసుపత్రులు, పార్కులు, స్పోర్ట్స్-సాంస్కృతిక కేంద్రాలు, ఐటీ/ఐటీఈఎస్ టెక్నాలజీ పార్కుల వంటివి ఏర్పాటు చేయడానికి వీలుంటుందని ప్రభుత్వం చెబుతోంది.
ఇళ్ల ధరలు తగ్గుతాయి
రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా ఇళ్ల ధరలను తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. 50-60 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన పాత ఇండస్ట్రీయల్ ఎస్టేట్‌లు ఇపుడు హైదరాబాద్ మహానగరంలోకి చేరాయి. ఇవి కాలుష్య కారకంగా మారాయి. అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ల్యాండ్ ను మల్టీ యూజ్‌గా మార్చాలని నిర్ణయించింది. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పాలసీ వెనుక వేలకోట్ల కుంభకోణం దాగి ఉందని ఆరోపిస్తున్నాయి.
ప్రతిపక్షాల వ్యతిరేకత
తెలంగాణలో ప్రతిపక్షాలన్నీ ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పాయి. ప్రభుత్వ నిర్ణయం, పాలసీని బీజేపీ, బీఆర్‌ఎస్ బలంగా తిప్పికొడుతున్నాయి. ఈ పాలసీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఇదో పెద్ద స్కామ్ అని అంటున్నాయి. ఇది రూ.6.29 లక్షల కోట్ల భూముల దోపిడీగా చెబుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు, బీజేపీ లెజిస్లేచర్ పార్టీ లీడర్ అలేటి మహేశ్వర్ రెడ్డి తదితరులు రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిసి మెమొరాండమ్ సమర్పించారు. ఈ పాలసీని రద్దు చేయాలనీ, దీనిపై చర్చకు స్పెషల్ అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేయించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. బీజేపీ అధికారంలోకి వచ్చాక.. ఈ పాలసీపై పూర్తి దర్యాప్తు చేయించి.. కుంభకోణానికి పాల్పడిన వారిని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.
Also Read : పంచాయితీ ఎన్నికల బరిలో యువత జోరు.. 40 ఏళ్ళ లోపు వారే ఎక్కువ
బీఆర్‌ఎస్ నిజనిర్ధారణ బృందాల ఏర్పాటు
పరిశ్రమల భూముల అంశంలో హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ (హిల్ట్) పాలసీ ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. హిల్ట్ పేరుతో ప్రభుత్వం భూకుంభకోణానికి పాల్పడుతోందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపిస్తున్నారు. రూ.5 లక్షల కోట్ల విలువైన భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు యత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ అంశంపై పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు సీనియర్ నాయకులతో కూడిన ఎనిమిది నిజనిర్ధారణ బృందాలను కేటీఆర్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు భారత రాష్ట్ర సమితి ఓ ప్రకటనలో వెల్లడించింది. పార్టీ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించి... క్షేత్రస్థాయి పర్యటనలపై దిశానిర్దేశం చేసినట్లు పార్టీ తెలిపింది.
Follow Us