/rtv/media/media_files/2025/12/30/fotojet-51-2025-12-30-11-30-19.jpg)
Panthangi Toll Plaza
Toll Free Travel : సంక్రాంతి పండగకు సొంతవాహనంలో ఊరెళ్తున్నారా? అయితే ఈ గుడ్ న్యూస్ మీ కోసమే. అవును సంక్రాంతికి వాహనాల్లో సొంతూళ్లకు వెళ్లేవారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. అదెంటంటే జాతీయ రహదారులపై వారి వాహనాల టోల్‌చార్జీ(Toll Gate Charges)లను ప్రభుత్వమే భరించేందుకు సిద్ధమవుతోంది. ఇలా చేయడం ద్వారా టోల్‌ప్లాజా(toll-gates)ల వద్ద ట్రాఫిక్‌జామ్‌ల నుంచి ప్రయాణికులకు ఉపశమనం కల్పించాలని నిర్ణయించినట్టు ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. సర్కారు నిర్ణయానికి కేంద్రం అంగీకారం తెలిపితే ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, వరంగల్, విజయవాడవైపు వెళ్లే ప్రయాణికులకు భారీగా ఊరట కలుగుతుంది. ఏటా సంక్రాంతి పండుగ సమయంలో టోల్‌ప్లాజాల వద్ద పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడం సర్వసాధారణమైంది.
Also Read : Vaikuntha Ekadashi 2025: ఆలయాలకు పోటెత్తిన భక్తులు.. అంతటా వైకుంఠ ఏకాదశి శోభ
Good News For Motorists Traveling To The City For Sankranti
రాష్ట్రంలో ఉన్న హైవేలన్నింటితో పోలిస్తే.. హైదరాబాద్ -విజయవాడ (ఎన్‌హెచ్-65) హైవేపై తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న పంతంగి, కొర్లపాడు టోల్‌ప్లాజాల దగ్గర ట్రాఫిక్ రద్దీ మరింత అధికంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో.. పండగ వేళ హైవేలపై ట్రాఫిక్ జామ్‌లకు స్వస్తి పలికి, ప్రయాణికులు వేగంగా గమ్యం చేరేందుకు ప్రభుత్వం ఈ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. అయితే, దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం. ఒకవేళ అనుమతి ఇస్తే సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల టోల్‌చార్జీ(Toll Plaza charges)లను తామే చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది.., అందుకు అనుమతినివ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర రోడ్లు, భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
అయితే తెలంగాణ వాసులు అత్యధికంగా జరుపుకునే దసరా పండుగకు ఎలాంటి చార్జీలను మాఫీ చేయని తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రజలు జరుపుకునే సంక్రాంతి పండుగకు టోల్ ఫ్రీ ప్రకటించడాన్ని తెలంగాణ వాదులు తప్పుపడుతున్నారు. తద్వారా తెలంగాణ ఆదాయాన్ని ఆంధ్రకు ధారదత్తం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. తెలంగాణలో సంక్రాంతి(makarasankranthi) పండుగను ఫీడ పండుగగా భావిస్తారని, అందుకే పెద్దగా జరుపుకోరని అలాంటి పండుగకు టోల్ ఫ్రీ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారు.
Also Read : రేపిస్ట్ తండ్రి కోసం కూతురు సంచలన లేఖ
Follow Us