TG New Village Panchayats: తెలంగాణలో 3వేలకు పైగా కొత్త గ్రామపంచాయితీలు..!

తెలంగాణ ప్రభుత్వం కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటుకు సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం మార్గదర్శకాలు విడుదల చేసింది. BRS ఏర్పాటు చేసిన గ్రామపంచాయతీలతో పాటు ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్నవి కలిసి మొత్తం కొత్త గ్రామపంచాయతీలు దాదాపు 3500లకు చేరుకోనుంది.

New Update
New Gram Panchayats

TG New Village Panchayats

TG New Village Panchayats

తెలంగాణ(Telangana) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త గ్రామపంచాయతీల(New Gram Panchayats) ఏర్పాటుకు సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటుపై మార్గదర్శకాలు విడుదల చేసింది. విడుద చేసిన నూతన గైడ్‌లైన్స్ ప్రకారం.. కనీసం 500మంది జనాభా ఉన్న గ్రామాలను గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా గ్రామపంచాయతీల మధ్య కనీస దూరం 3కి.మీలు ఉండాలని నిబంధన ఉంది.

Also Read :  తొక్కిసలాట ఘటన.. కర్ణాటక సర్కార్‌ కీలక నిర్ణయం

Also Read :  ప్రధాని మోదీకి మ‌ల్లిఖార్జున్ ఖర్గే సంచలన లేఖ.. ఎందుకంటే..?

కొత్త నిబంధనలతో ప్రభుత్వంపై భారం తప్పదని అధికారులు అంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 12,777 గ్రామపంచాయతీలు ఉన్నాయి. కొత్త గ్రామపంచాయతీల కోసం 250 అప్లికేషన్లు వచ్చాయి. కొత్త గైడ్‌లైన్స్‌ ప్రకారం దరఖాస్తులు పరిశీలిస్తున్నారు అధికారులు. దరఖాస్తు చేసుకున్న గ్రామాల్లో 37 గ్రామాల్లోనే 500 జనాభా ఉంది. 90 కుటుంబాలు ఉన్న గ్రామాలను పంచాయతీలుగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో దాదాపు 3వేలకు పైగా గ్రామపంచాయతీలు ఏర్పాటు చేసింది. ఇప్పుడు దరఖాస్తు చేసుకున్న గ్రామపంచాయతీలతో కలిసి మొత్తం కొత్త గ్రామపంచాయతీల సంఖ్య దాదాపు 3500లకు చేరుకోనుంది.

Also Read: విమానం మెట్లు ఎక్కుతుండగా జారిపడ్డ ట్రంప్.. వీడియో వైరల్

Also Read :  సోనమ్ మామూల్ది కాదయ్యా ..భర్తను చంపి ఫేస్బుక్లో పోస్టు.. హనీమూన్‌ కేసులో బిగ్ ట్విస్ట్!

 

latest-telugu-news | telugu-news | today-news-in-telugu | latest telangana news

Advertisment
Advertisment
తాజా కథనాలు