/rtv/media/media_files/2025/02/20/6wrvXI3z7v7i47lWrUGr.jpg)
Telangana Assembly Special Session
Telangana Assembly Special Session: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో(Telangana local body elections) 42 శాతం బీసీ రిజర్వేషన్(42% BC Reservation) కల్పిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్(Congress) ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. అదే సమయంలో ఎస్సీ వర్గీకరణ(SC Classification) విషయంపై కూడా కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. అదే సమయంలో ఈ విషయంలో అవసరమైతే కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవడానికి రేవంత్ రెడ్డి సర్కార్(Revanth Reddy Sarkar) రెడీ అవుతోంది. దీనికోసం కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. ఈ రెండు విషయాల్లో అనుకున్నది అనుకున్నట్లు జరిగితే స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఏక పక్షంగా విజయం సాధించవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది.
Also Read: ఇంత పిరికోడివి ఏంట్రా.. ప్రేమ, పెళ్లన్నాడు.. నుదుటిపై బొట్టు పెట్టి పారిపోయాడు!
స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా ఎస్సీవర్గీకరణ, బీసీ రిజర్వేషన్ బిల్లు(BC Reservation Bill)లను ప్రవేశపెట్టి కేంద్రానికి పంపడం ద్వారా కేంద్రాన్ని గేమ్ లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. దానిలో భాగంగా ఈ నెలలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అంతకు ముందే ప్రత్యేక అసెంబ్లీ భేటీకి రేవంత్ నిర్ణయించారు. మార్చి 1 నుంచి 5 వరకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ, బీసీల రిజర్వేషన్లపై 3 బిల్లులు ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. సమావేశాల్లో వీటి పైన చర్చ నిర్వహించి బిల్లులకు చట్టబద్ధత కల్పించనున్నారు. కాగా, మార్చి 10 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు ఢిల్లీ కి వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్ బీసీ రిజర్వేషన్లకు మద్దతివ్వాలని కేంద్రాన్ని కోరనున్నారు. కేంద్రం నుంచి వచ్చే స్పందనకు అనుగుణంగా రేవంత్ పోరాటానికి దిగాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ఈ అంశం పైన అవసరమైతే అఖిలపక్ష నేతల్ని ఢిల్లీ తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు అన్ని పార్టీలకు త్వరలో సీఎం లేఖలు రాసేందుకు సిద్దమయ్యారని చెబుతున్నారు. ఇక, మార్చి 10వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో వర్గీకరణకు చట్టబద్ధతపై ఒక బిల్లు, బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లుతో పాటుగా విద్య, ఉపాధి రంగాల్లోనూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసేందుకు ఉద్దేశించిన బిల్లులకు చట్టబద్ధత కల్పించనుంది. రిజర్వేషన్ల విషయం లో కేంద్రంతో పోరాటం చేయటానికి వెనుకడేది లేదని రేవంత్ టీం చెబుతోంది. ఢిల్లీతో పోరాటం అయితే బీసీలకు రిజర్వేషన్లను పెంచుతూ చేసే చట్టాన్ని రాష్ట్ర అసెంబ్లీ ఆమోదిస్తే సరిపోదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. పెంచిన రిజర్వేషన్లు అమలు కావాలంటే మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. లేదా పార్లమెంటులో ఈ చట్టాన్ని ఆమోదింపజేసి, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలి. ఈ చట్టానికి కేంద్రం ఆమోదం తెలపకపోతే పోరాటం చేయాలని రేవంత్ ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంలో మిగిలిన రాజకీయ పార్టీలను కూడా ఢిల్లీకి రావాలని కోరనున్నారు. దీంతో.. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల ద్వారా సీఎం రేవంత్ కొత్త వ్యూహాలు అమలు చేసేందుకు సిద్దం అవుతున్నారు.
Also Read: కుంభమేళాలో జాగ్రత్త.. మల కోలిఫాం బ్యాక్టీరియా ఎంత డేంజరస్ అంటే..!
కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకే..
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కావాలంటే పార్లమెంట్ ఆమోదం లభించాలి. అయితే అది సాధ్యం కాదు కనుక రాష్ర్ట ప్రభుత్వం కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తుంది. తాము బీసీ రిజర్వేషన్ కు కట్టుబడి ఉన్నామని, అసెంబ్లీలో తీర్మానం కూడా చేశామని, అయితే కేంద్రానికి పంపితే కేంద్రం ఆమోదించడం లేదని చెప్పడం ద్వారా తన నిర్ణయానికి మద్ధతు లభించేలా, కేంద్రంపై వ్యతిరేకత పెరిగేలా రాష్ట్రం పావులు కదుపుతోంది. అటు ఎస్సీవర్గీకరణను ఆమోదించడం, ఇటు బీసీ రిజర్వేషన్ ను కేంద్రానికి పంపడం ద్వారా తన చిత్తశుద్ధీలో ఎలాంటి లోపం లేదని అంతా కేంద్రానితే తప్పు అనేలా రేవంత్ ప్రభుత్వం పావులు కదుపుతుంది.
Also Read: BIG BREAKING: వల్లభనేని వంశీకి మరో ఎదురు దెబ్బ.. హైకోర్టు బిగ్ షాక్!