/rtv/media/media_files/2025/05/22/KrJle9BVkkamRgKgODsC.jpg)
marriage of an orphaned young woman
Orphan Marriage: చిన్నతనంలో తల్లి దండ్రిని కోల్పోయిన ఓ అనాథ యువతికి కలెక్టర్ ఇతర అధికారులు పెళ్లి పెద్దలై వివాహం జరిపించిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లా కలెక్టర్ కార్యాలయం పెళ్లి వేదిక కాగా కలెక్టర్ పెళ్లి పెద్దగా వ్యవహరించి ఆమెకు వివాహం జరిపించారు. వివరాలు ఇలా ఉన్నాయి.
పెళ్లి అనగానే అమ్మాయి తరుపు బంధువలు, అబ్బాయి తరుపు బంధువులు ఇలా అందర్నీ చూస్తారు. కానీ బంధువులే కాదు అసలు అమ్మనాన్నలు లేని బిడ్డల సంగతేంటీ? అనాథలుగా పెరిగి ఓ తోడు దొరికితే కన్యదానం చేసి, సాగనంపే తల్లిదండ్రులు లేకుంటే ఆ బిడ్డకు ఎంత దుంఖం. పెళ్లీడుకు వచ్చే వరకు ఒంటరిగా బతికిన కనీసం పెళ్లయిన నలుగురి సమక్షంలో జరగాలని కోరుకుంటారు. అలాంటి అనాథకు ఓ ఆశ్రమం నిర్వాహకులు వివాహం నిశ్చయించారు. అయితే ఎవరూ లేని ఆమెకు పెళ్లి చేయడం ఎలా అలోచించిన ఆశ్రమ నిర్వహాకుడు కలెక్టర్‌ను సంప్రదించాడు. అమ్మాయి కథనం విన్న తర్వాత మనసు ద్రవించిన ఆ కలెక్టర్ అన్ని తానే అయి పెళ్లి చేస్తానని మాటిచ్చాడు. అన్నట్లుగానే యువతి పెళ్లి కి పెద్దగా మారి అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. ఉద్యోగులంతా ఆమెకు బంధువులయ్యారు. కలెక్టరేట్ వివాహానికి వేదికైంది.
ఇది కూడా చూడండి: Cherry Tomatoes: చెర్రీ టమోటాల గురించి విన్నారా? ఈ 5 అద్భుతమైన ప్రయోజనాల తప్పక తెలుసుకోండి!
బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన నక్క మానసను రామగుండం తబిత బాలల సంరక్షణ కేంద్రం నిర్వాహకులు చేరదీశారు. ఇన్నాళ్లు ఆమె సంరక్షణ చూసుకున్నారు. కాగా ఆమెకు పెళ్లీడు రావడంతో వివాహం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష చొరవ తీసుకున్నారు. ఉద్యోగులంతా పెళ్లి పెద్దలై వివాహాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. నక్క మానస, ఆమె చెల్లెలు లక్ష్మిలు16 ఏళ్ల కిందట తల్లిదండ్రులను కోల్పోయారు. వారిని రామగుండం తబిత బాలల సంరక్షణ కేంద్రం నిర్వాహకులు వీరేందర్‌నాయక్, విమల దంపతులు వారిని చేరదీశారు. ఆ ఆశ్రమంలో ఉంటూనే.. మానస డిగ్రీ పూర్తి చేయగా, ఆమె చెల్లెలు లక్ష్మి ప్రస్తుతం ఇంటర్ కంప్లీట్ చేసింది. ఈ క్రమంలో మానసకు వివాహం చేయాలని భావించారు ఆశ్రమం నిర్వాహకులు. దీనిలో భాగంగా జనగామ జిల్లా రఘునాథపల్లికి చెందిన రాజేశ్‌తో ఆమె పెళ్లి నిశ్చయించారు.
Also Read: 52 ఏళ్ల వయసులో 30 ఏళ్ల యువకుడితో ప్రేమ.. ISI ఏజెంట్‌గా మారిన భారత రాయబారి..
విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష.. మానసకు అండగా నిలిచి.. ఆమె పెళ్లి జరిపించడానికి సహకరించారు. ఆయన పెళ్లి పెద్దగా ఉండి అన్ని తానై చూసుకున్నారు. అంతేకాక కలెక్టర్ పేరిటే వివాహ ఆహ్వాన పత్రికలు ముద్రించారు. పెళ్లికి అవసరమైన సామగ్రిని ఇతర అధికారులు సమకూర్చారు. పెద్దపల్లి కలెక్టరేట్ ఆవరణలో పెళ్లి ఘనంగా జరిగింది. తబిత బాలల సంరక్షణ కేంద్రం నిర్వాహకులు వీరేందర్‌నాయక్, విమల దంపతులు మానసకు కన్యాదానం చేశారు. అంతేకాక టీఎన్జీవోల ఆధ్వర్యంలో మానసకు రూ.61,800 చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయరమణారావు, అదనపు కలెక్టర్ దాసరి వేణు, డీసీపీ కరుణాకర్, జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు బొంకూరు శంకర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.