/rtv/media/media_files/2026/02/10/jeevan-reddy-vs-mla-sanjay-2026-02-10-17-27-55.jpg)
Jeevan-Reddy-Vs-Mla-Sanjay
MLA Sanjay vs Jeevan Reddy : జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జగడం తారస్థాయికి చేరుకుంది. మాజీమంత్రి జీవన్ రెడ్డికి, స్థానిక ఎమ్మెల్యే సంజయ్‌కుమార్(mlc jeevan reddy about sanjay kumar) కు మధ్య సాగుతున్న రాజకీయ వైరం మరింత ముదిరింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన జీవన్ రెడ్డి ఓటమిపాలవ్వగా బీఆర్‌ఎస్ అభ్యర్థిగా సంజయ్ విజయం సాధించారు. అయితే ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో సంజయ్ కాంగ్రేస్ తీర్థం పుచ్చుకున్నాడు. అయితే ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తు్న్న జీవన్ రెడ్డి అవకాశం దొరికినప్పుడల్లా సంజయ్‌తో పాటు రాష్ర్ట నాయకత్వం పై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. కాగా ఈ వైరం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మరింత ముదిరింది. మున్సిపల్ టికెట్ల విషయంలో ఇరు వర్గాల మధ్య ఆధిపత్యపోరు కలకలం రేపింది. సంజయ్ గత బీఆర్‌ఎస్ నేతలకే టికెట్లు ఇచ్చుకున్నాడని ఆరోపించిన జీవన్ రెడ్డి ఏకంగా తన వర్గం వారిచేత నామినేషన్లు వేయించడం కలకలం రేపింది. అంతేకాక వారి తరుపున ఆయన ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు.
Also Read : తెలంగాణలో బీఆర్‌ఎస్ ఫోన్ ట్యాపింగ్.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సంజయ్‌పై ఈసీకి ఫిర్యాదు
ఇదిలా ఉండగా తాజాగా ఎమ్మెల్యే సంజయ్ పై జీవన్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే రాయికల్, జగిత్యాల ప్రాంతాల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆయనపై చర్యలు తీసుకోవాలని ఈసీకి రాసిన లేఖలో కోరారు. అయితే సంజయ్ కాంగ్రెస్(congress jeevan reddy) లోకి రావడాన్ని వ్యతిరేకిస్తున్న జీవన్‌రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్న సంజయ్‌పై ఏకంగా ఈసీ(state-election-commission) కి లేఖ రాయడం సంచలనంగా మారింది. రేపు పోలింగ్ జరగనుండగా ఈ రోజు లేఖ రాయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Also Read : అక్కడ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. ఈసీ సంచలన నిర్ణయం!
జీవన్ రెడ్డిపై చర్యలు తీసుకుంటారా?
కాగా, జగిత్యాల(jagitial) ను తన అడ్డాగా భావించే జీవన్ రెడ్డి తన స్థానంలోకి సంజయ్ రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ర్ట నాయకులు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. గత రెండేళ్లుగా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికలు ఇద్దరిమధ్య మరింత దూరాన్ని పెంచాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సంజయ్ వర్గానికే కేటాయించి తన వర్గానికి అన్యాయం చేశారని జీవన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో తన అనుచరులను స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దింపి వారి తరఫున ప్రచారం నిర్వహించారు. కాగా ఇప్పుడు ఏకంగా సంజయ్ పై ఈసీకి లేఖ రాయడం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాశంగా మారింది. జీవన్ రెడ్డి వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్న అధిష్టానం ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయనపై చర్యలు తీసుకుంటుందన్న ప్రచారం సాగుతోంది. అయితే సీనియర్ నేతగా ఉన్న జీవన్ రెడ్డి విషయంలో అధిష్టానం అంతా తొందరగా నిర్ణయం తీసుకునే అవకాశం లేదన్న వాదన కూడా వినపడుతోంది. ఎన్నికల తర్వాత జీవన్ రెడ్డి భవితవ్యం తేలనుంది. - Muncipal Election latest news
Follow Us