Phone Tapping : తెలంగాణలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉండగా సాగించిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నేటికి ఆ పార్టీ నేతలు కొనసాగిస్తున్నారని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ నేతలు ఇంకా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారన్న అనుమానం ఉంది అన్నారు. కొందరు వ్యక్తులు చట్టవిరుద్ధంగా ఇతరుల వ్యక్తిగత సంభాషణలను వింటున్నారని, ప్రజాస్వామ్యంలో ఇది తీవ్రమైన నేరమని ఆయన పేర్కొన్నారు. సాంకేతికతను తప్పుడు పద్ధతుల్లో వాడుతూ రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఆరోపణలకు సంబంధించి ఆయన వివరిస్తూ ఖమ్మం జిల్లా ఉద్యోగ సంఘాల నేతలతో నేను మాట్లాడిన ఫోన్ కాల్ వివరాలు ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతామధుకు ఎలా తెలిసిందని ఆయన ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ఇంకా ట్యాపింగ్ చేస్తుందనడానికి ఇదే నిదర్శనమని పొంగులేటి వెల్లడించారు. తమ పార్టీ కార్పొరేటర్లతో నిర్వహించిన కాన్ఫరెన్స్ కాల్ లో నేను ఏం మాట్లాడానో ట్యాపింగ్ చేసి విన్నారు అని, నేను ఉద్యోగ సంఘం నాయకులతో మాట్లాడిన మాటలు కూడా ఎలా విన్నారో విచారణ చేస్తాం అని తెలిపారు. బీఆర్ఎస్ పెద్దల వద్ద ఇంకా ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఉన్నాయని ఆరోపించారు. మా ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంటుందన్నారు.
బీఆర్‌ఎస్ నేతలు ఏ మామిడి తోటలలో, ఫామ్ హౌస్ లలో ట్యాపింగ్ పరికరాలు పెట్టి అక్రమ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారో దర్యాప్తు చేస్తామని, చట్టపరంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులు, జడ్జీలు, వ్యాపారులు, జర్నలిస్టులు, సెలబ్రెటీలు, భార్యభర్తల ఫోన్లను కూడా బీఆర్ఎస్ పాలకులు అప్పట్లో ట్యాపింగ్ చేశారని..ఇప్పటికి కూడా వారి వద్ద ట్యాపింగ్ పరికరాలు ఉన్నాయన్న అనుమానాలపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తుందన్నారు.సాంకేతికతను తప్పుడు పద్ధతుల్లో వాడుతూ రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ మొత్తం వ్యవహారంలో ఉన్న కుట్ర కోణాన్ని బయటపెట్టి, దోషులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
Phone Tapping: తెలంగాణలో బీఆర్‌ఎస్ ఫోన్ ట్యాపింగ్.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉండగా సాగించిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నేటికి ఆ పార్టీ నేతలు కొనసాగిస్తున్నారని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలు ఇంకా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారన్న అనుమానం ఉందన్నారు.
Minister Ponguleti Srinivas Reddy's sensational comments