బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్.. కవిత సంచలన ట్వీట్!

TG: మాగునూరు జెడ్పీ హైస్కూల్‌లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై ప్రశ్నించేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్ మోహన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం దారుణమన్నారు కవిత. బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ పెద్దలు బయపడుతున్నారని అన్నారు.

New Update
Kavita

MLC Kavita: తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత రీ-ఎంట్రీ ఇచ్చారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ పై విడుదలైన కవిత గత కొన్ని రోజులుగా రాజకీయాలు దూరంగా ఉంటూ వచ్చారు. కాగా ఇటీవల బీసీ రిజర్వేషన్ల నినాదంతో ప్రజల్లోకి వచ్చారు కవిత. ఆ రోజు నుంచి అటు రాజకీయాలకు, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వస్తున్నారు. అయితే..  తెలంగాణలో ప్రభుత్వం హాస్టల్స్ లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై ఎమ్మెల్సీ కవిత సీరియస్ అయ్యారు.

వణుకు పట్టుకుంది అంటూ....

ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ లో.. " చేసిన తప్పులకు ప్రజలు తిరగబడతారనే భయంతో ప్రభుత్వ పెద్దల్లో వణుకు పుడుతోంది. మాగునూరు జెడ్పీ హైస్కూల్ లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తారని, ప్రజలతో కలిసి ఉద్యమిస్తారనే భయంతో తెల్లవారుజామునే అక్రమ అరెస్టులకు తెరలేపింది కాంగ్రెస్ సర్కార్. 

ప్రజా పాలను అంటూ గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ పెద్దలు, ప్రజలు నిలదీస్తారనే భయంతో బీఆర్ఎస్ నేతలు, ప్రజలను నిర్బందిస్తూ, తెలంగాణ ఉద్యమం నాటి సమైక్య రాష్ట్ర ప్రభుత్వ అణిచివేతలను తలపిస్తున్నాయి.బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్ మోహన్ రెడ్డి, కార్యకర్తల ముందస్తు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా.. తెలంగాణ గడ్డ పోరాటాల పురిటిగడ్డ.. అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ప్రజా తిరుగుబాటులను అణిచివేయాలనుకోవడం మూర్ఖత్వం." అని రేవంత్ సర్కార్ పై నిప్పులు చెరిగారు.

ప్రతిపక్షాల గొంతు నొక్కడం: హరీష్ రావు

వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్న మాగనూరు ZPHS పాఠశాలను సందర్శించడానికి వెళ్తారనే నెపంతో మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి తో పాటు, బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు హరీష్ రావు. తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్పారు. పాఠశాలలు సందర్శించడానికి వెళ్తే ప్రభుత్వానికి ఎందుకు అంత భయం? పురుగులన్నం మాకొద్దు అని విద్యార్థులు రోడ్డెక్కి నినదిస్తుంటే చీమ కుట్టినట్లైనా లేదా? విద్యార్దులకు మంచి భోజనం కూడా పెట్టని దీన స్థితిలో ఈ ప్రభుత్వం ఉందా? అప్రాజ్యస్వామిక విధానాలు విడనాడాలని, అరెస్టు చేసిన మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో పాటు, బీఆర్ఎస్ నాయకులకు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం కాదు సీఎం రేవంత్... ఫుడ్ పాయిజన్ వల్ల ఆసుపత్రి పాలైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించండి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచలనాలు చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు