BIG BREAKING: నిజామాబాద్‌లో హైటెన్షన్.. మేయర్ భర్తపై సుత్తెతో దాడి!

నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని నాగారంలో కార్పొరేటర్‌ ఆఫీస్ దగ్గర నగర మేయర్‌ నీతూకిరణ్‌ భర్త, బీఆర్ఎస్‌ నాయకుడు దండు చంద్రశేఖర్‌పై దాడి చేశారు. చంద్రశేఖర్, ఆయన అనుచరులను ఆటో డ్రైవర్‌ షేక్‌ రసూల్‌ అక్కడికి చేరుకొని దూషిస్తూ సుత్తెతో ముఖంపై దాడి చేశాడు.

New Update
Nizamabad

Nizamabad

TG News:నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో హైటెన్షన్ నెలకొంది. నగర మేయర్‌ నీతూ కిరణ్‌ భర్త, బీఆర్ఎస్‌  నాయకుడు దండు చంద్రశేఖర్‌పై దాడి జరిగింది. దీంతో స్థానికంగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారంలో కార్పొరేటర్‌ కార్యాలయం దగ్గర చంద్రశేఖర్, ఆయన అనుచరులు నిల్చొని ఉన్నారు. ఈ సమయంలో ఆటో డ్రైవర్‌ షేక్‌ రసూల్‌ అక్కడికి చేరుకొని దూషించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో  చేతితో ముఖంపై దాడి చేశాడు. దీంతో చంద్రశేఖర్‌ కిందపడిపోయారు. 


Also Read: Movies: నాగ చైతన్య–శోభిత పెళ్ళి శుభలేఖ వచ్చేసింది..చూశారా

తప్పన ప్రాణాపాయం:

అక్కడే ఉన్న చంద్రశేఖర్ అనుచరుల్ని బెదిరించడంతో వారు  ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోయినట్లు తెలుస్తోంది. అనంతరం ఆటోలో తన వెంట తెచ్చుకున్న సుత్తెతో చంద్రశేఖర్‌ ముఖంపై రసూల్‌ కట్టిగా కొట్టాడు. దీంతో చంద్రశేఖర్‌ దవడ పైభాగంలో తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన చంద్రశేఖర్‌ని దగ్గరలో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు. చంద్రశేఖర్ తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చంద్రశేఖర్‌ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఏసీపీ తెలిపారు. దండు చంద్రశేఖర్‌ కు ఎలాంటి ప్రాణాపాయం లేదని వెల్లడించారు. మేయర్‌ నీతూకిరణ్‌ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. త్వరగా నిందితుడిని పట్టుకుంటామని పోలీసు అధికారులు చెబుతున్నారు.

Also Read: Rahul Gandhi: కులగణనపై రాహుల్‌గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు

ఇది కూడా చదవండి: నిమ్మకాయను ఇలా వాడితే అజీర్తి సమస్య ఉండదు

Also Read: హైడ్రా మరో కీలక నిర్ణయం.. ఈసారి ఆ సంస్థతో కలిసి

Advertisment
తాజా కథనాలు