Hyderabad: కోకాపేటలో కాసుల వర్షం.. ఎకరం భూమి రూ.151 కోట్లు

రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం కోకాపేటలో భూములు మరోసారి రికార్డు ధరలు పలికాయి. తాజాగా ఎకరం భూమి ఏకంగా రూ.151.25 కోట్లు ధర పలికింది.

New Update
Neopolis plots in Kokapet fetch record prices

Neopolis plots in Kokapet fetch record prices

రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం కోకాపేటలో భూములు మరోసారి రికార్డు ధరలు పలికాయి. తాజాగా ఎకరం భూమి ఏకంగా రూ.151.25 కోట్లు ధర పలికింది. ఇక వివరాల్లోకి వెళ్తే శుక్రవారం హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (HMDA) ఆధ్వర్యంలో కోకాపేటలోని నియోపొలిస్‌ లేఅవుట్‌లో వేలం(auction) నిర్వహించారు. ఇందులో ఎకరం భూమి రూ.151.35 కోట్లకు అమ్ముడుపోయింది. ప్లాట్‌ నెంబర్ 15,16లో మొత్తం 9.06 ఎకరాలను వేలం వేశారు. దీంతో ప్రభుత్వానికి రూ.1,353 కోట్ల ఆదాయం వచ్చింది.  

Also Read: మావోయిస్టుల లొంగుబాటు, నెరవేరనున్న కేంద్రం లక్ష్యం.. ఇంక ఎంతమంది మిగిలారంటే?

Neopolis Plots In Kokapet Fetch Record Prices

ఇదిలాఉండగా ఇటీవలే నియోపోలిస్‌లో ఉన్న సర్వే నెంబర్ 17,18లో భూములకు వేలం నిర్వహించారు. సర్వే నెంబర్ 17లోని ఎకరం భూమి ధర రూ.137.25 కోట్లు పలికింది. ఇందులో ముందుగా ఎకరానికి కనీస ధర రూ.99 కోట్లుగా నిర్ణయించారు. చివరికి రూ.137.25 కోట్లకు అమ్మడుపోయింది. మరోవైపు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(TGIIC) కూడా ఇటీవల రాయదుర్గంలో వేలం పాట నిర్వహించింద్. ఇక్కడ 7.67 ఎకరాలను ఓసంస్థ ఏకంగా రూ.1357 కోట్లకు దక్కించుకుంది. ఈ ప్రాంతంలో ఎకరం కనీస ధరను రూ.101 కోట్లు నిర్ణయించారు. 

Also Read :  గ్రామస్థాయి నుంచే చట్టసభల్లోకి..పాతతరం ఎమ్మెల్యేలంతా సర్పంచ్ లే..

Advertisment
తాజా కథనాలు