లగచర్లలో జాతీయ ఎస్టీ కమిషన్.. గిరిజనులను వేధిస్తే సహించేది లేదంటూ వార్నింగ్

సోమవారం జాతీయ ఎస్టీ కమిషన్‌ లగచర్లలో పర్యటించింది. రోటిబండ తండాలో కమిషన్ సభ్యులు బాధితులతో మాట్లాడారు. పోలీసులు అర్ధరాత్రి అరాచకం చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. గిరిజనులను పోలీసులు వేధిస్తే సహించేది లేదంటూ కమిషన్ సభ్యులు తేల్చిచెప్పారు.

stt
New Update

వికారాబాద్ జిల్లాలోని లగచర్లలో ఫార్మా కంపెనీ భూసేకరణ కోసం ప్రజాభిప్రాయం తెలుసుకనేందుకు వెళ్లిన కలెక్టర్, అధికారులపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఘటనకు పాల్పడ్డ వారిలో పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ భూసేకరణకు సంబంధించిన పరిణామాలను తెలుసుకునేందుకు సోమవారం జాతీయ ఎస్టీ కమిషన్‌ లగచర్లలో పర్యటించింది. రోటిబండ తండాలో కమిషన్ సభ్యులు బాధితులతో మాట్లాడారు. 

Also Read: ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం..107 విమాన సర్వీసులు ఆలస్యం!

National ST Commission

కలెక్టర్, అధికారులపై దాడి జరిగిన తర్వాత గిరిజనులపై పోలీసులు వ్యవహరించిన తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే పోలీసులు అర్ధరాత్రి అరాచకం చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్టీ కమిషన్ సభ్యులు పోలీసులు, కొండగల్ ప్రభుత్వ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్‌ ఎస్పీకి ఫోన్ చేసి మాట్లాడారు. గిరిజనులను పోలీసులు వేధిస్తే సహించేది లేదంటూ తేల్చిచెప్పారు.    

Also Read: High Court: భార్యను ఉద్యోగం మానేయమని బలవంతం చేయడం క్రూరత్వమే!

ఇదిలాఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం ఫార్మా కంపెనీ కోసం తమ భూములను బలవంతంగా సేకరిస్తోందని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు లగచర్ల, రోటిబండతండా గ్రామాలకు చెందిన గిరిజనులు ఆదివారం ఢిల్లీకి వెళ్లారు. ఇప్పటికే వాళ్లు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. వాళ్ల వెంట మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, బీఆర్‌ఎస్ నేతలు కూడా ఉన్నారు.

Also Read: పరువు పోతుందనే లగచర్లలో రేవంత్ కుట్ర..ఈటల సంచలన ఆరోపణలు!

మరోవైపు లగచర్లలో అధికారులపై జరిగిన దాడి ఘటనలో శనివారం రాత్రి పోలీసులు మరో నలుగురిని అరెస్టు చేశారు. నిందితులను సంగారెడ్డి జైలుకు తరలించారు. ముందుగా వీళ్లను రాత్రి 10.30 గంటలకు కొడంగల్ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చి అర్ధరాత్రి 12.45 గంటలకు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి శ్రీరామ్ ఎదుట హాదరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో.. నిందితులు మదరయ్య, బసప్ప, గోపాల్‌,నీరెటి రాఘవేందర్‌లను సంగారెడ్డి జైలుకు తరలించారు. 

Also Read: పోటా పోటీగా మహారాష్ట్ర ఎన్నికలు.. అధికారంలోకి వచ్చేది ఎవరంటే ?

#telugu-news #telangana #lagacharla #Lagacharla Incident
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe