High Court: భార్యను ఉద్యోగం మానేయమని బలవంతం చేయడం క్రూరత్వమే!

మధ్యప్రదేశ్‌ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంటలో భార్యకు ఉద్యోగం రాగా భర్తకు ఉద్యోగం లేదు. దీంతో భర్త ఆమెను ఉద్యోగం మానేయని వేధించేవాడు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించగా..భర్త ప్రవర్తన క్రూరత్వమే అని మధ్య ప్రదేశ్‌ హైకోర్టు తీర్పునిచ్చింది.

New Update
mph

HighCourt:

ఉద్యోగం చేస్తున్న భార్యను రాజీనామా చేసి...తనకు నచ్చినట్లు జీవించాలని భర్త బలవంతం చేయడం క్రూరత్వమేనని మధ్యప్రదేశ్‌ హైకోర్టు స్పష్టం చేసింది. తాను ఉద్యోగం సంపాదించే వరకూ ఆమెను కూడా ఉద్యోగం చేయోద్దని, తన కోరిక ప్రకారం జీవించాలని భర్త తన భార్యను బలవంతం చేయడం కూడా క్రూరత్వం కిందకే వస్తుందని మధ్య ప్రదేశ్‌ హైకోర్టు ఇండోర్‌ ధర్మాసనం చెప్పింది. 

Also Read: Delhi: ఢిల్లీలో స్టేజ్–4 ఆంక్షలు..మొత్తం అన్ని స్కూళ్ళు క్లోజ్

అలా చేయడం వల్ల  భర్త లేదా భార్య కలిసి జీవించాలనుకుంటున్నారా? లేదా? అనేది వారి ఇష్టమని కోర్టు నొక్కి చెప్పింది. అయితే, జీవిత భాగస్వామి ఎంపిక ప్రకారం ఉద్యోగం చేయమని లేదా చేయవద్దని బలవంతం చేయలేరని తెలిపింది. కేసు వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ జంటకు 2014 ఏప్రిల్‌లో పెళ్లి జరిగింది. పెళ్లికి ముందే వీరికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. దీంతో ఇరువురూ వైవాహిక బంధంతో ఒక్కటి కావాలనుకున్నారు.

Also Read: కీరవాణి ఇంట పెళ్లి సందడి.. వైరల్ అవుతున్న ప్రీ వెడ్డింగ్ ఫొటోలు

పెద్దల అంగీకారంతో తరువాత వారు పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో సదరు భార్య 2017లో ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగానికి సెలెక్ట్‌ అయ్యింది. భర్త మాత్రం ఖాళీగానే ఉన్నాడు. భార్య సంపాదించడం.. తనకు ఎటువంటి ఉద్యోగం లేకపోవడంతో అతడు చిన్నతనంగా భావించాడు. అందుకే తాను ఏదో ఒక ఉద్యోగంలో చేరే వరకూ ఆమె కూడా ఇంటి దగ్గరే ఉండాలని అన్నాడు.

Also Read: Hyderabad: యాసిడ్‌తో అల్లం పేస్ట్‌...ప్రముఖ హోటళ్లకు ఇదే సరఫరా!

ఇందుకు ఆమె అంగీకరించపోవడంతో ఇరువురి మధ్య విబేధాలు మొదలయ్యాయి. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన ఆమె చివరకు విడాకుల కోసం  అప్లై చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కుటుంబ న్యాయస్థానం భర్తకు అనుకూలంగా తీర్పు చెప్పింది. దీంతో ఆమె హైకోర్టు ఇండోర్ ధర్మాసనంలో ఈ తీర్పును సవాల్ చేయగా.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ కుమార్ కైత్, జస్టిస్ సుశ్రుత్ ధర్మాధికారుల ధర్మాసనం ముందుకు ఈ కేసు విచారణ వచ్చింది. 

Also Read:  Andhra Pradesh: ఉన్నత పాఠశాలల సమయం గంట పెంపు!

జనవరి 2020లో కుటుంబ న్యాయస్థానంలో వైవాహిక హక్కుల పునరుద్ధరణ కోసం హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 9 కింద భర్త పిటిషన్‌ను దాఖలు చేశారని ధర్మాసనం చెప్పింది. ‘భార్య దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను కొట్టివేసిన తర్వాత.. భర్త 2022 అక్టోబరు 20 సెక్షన్ 9 పిటిషన్‌ను ఉపసంహరించుకోవడం కూడా న్యాయబద్దంగా లేదు. భర్త లేదా భార్య కలిసి జీవించాలనుకుంటున్నారా? అది వారి ఇష్టం... భర్త లేదా భార్య బలవంతం చేయలేరు. 

మరోవైపు, జీవిత భాగస్వామి ఇష్టానికి వ్యతిరేకంగా ఏ ఉద్యోగం చేయకూడదని, భార్యను ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలివేయమని ఒత్తిడి చేశారు.. ఉద్యోగం వదలి బలవంతంగా తనకు అనుగుణంగా జీవించాలని చెప్పడం క్రూరత్వానికి సమానం’ అని ధర్మాసనం తెలిపింది.
తన భర్త ప్రవర్తన, వైవాహిక జీవితంలో సానుకూలత లేకపోవడం, విభేదాలే విడాకులకు కారణమని భార్య  తెలిపింది. ఈ సందర్భంగా కుటుంబ న్యాయస్థానం తీర్పును ధర్మాసనం తప్పని తేల్చింది.

ఉద్యోగం మాత్రమే కాకుండా ఇతర  సమస్యల కారణంగా భార్య పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దాఖలు చేసిందని వివరించింది. అంతేకాకుండా, అప్పీలుదారు విడాకులు తీసుకోవడాన్ని ప్రతివాది కోరుకోకపోవడం క్రూరత్వానికి సమానమని ధర్మాసనం తేల్చి చెప్పింది. అనంతరం ఆమెకు విడాకులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు