Delhi: ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం..107 విమాన సర్వీసులు ఆలస్యం! దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకి వాయు కాలుష్యం తో పాటు పొగమంచు కూడా పెరిగిపోతుంది.దీంతో ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో మూడు విమానాలను రద్దు చేయగా.. మరో 107 విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తాయని అధికారులు తెలిపారు By Bhavana 18 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Delhi: దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకి వాయు కాలుష్యం తో పాటు పొగమంచు కూడా పెరిగిపోతుంది.సోమవారం నగరాన్ని పొగమంచు కమ్మేయడంతో దగ్గరి వాహనాలు కూడా కనిపించని దుస్థితి ఏర్పడింది. దీంతో ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో మూడు విమానాలను రద్దు చేయగా.. మరో 107 విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తాయని అధికారులు తెలిపారు. Also Read: Ap: ఏపీపై అల్పపీడనం ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అలాగే, నగరంలో వాయునాణ్యత సూచీ 428కి చేరడంతో.. ఢిల్లీలో కాలుష్యం స్థాయి పెరుగుతుండటంతో ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే పలు ఆంక్షలు విధించినప్పటికీ.. తాజాగా మరిన్ని కఠిన ఆంక్షలు అమలు చేయనుంది. Also Read: High Court: భార్యను ఉద్యోగం మానేయమని బలవంతం చేయడం క్రూరత్వమే! ఇక, ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్- 4 కింద మరిన్ని నిబంధనలను ఈరోజు (సోమవారం) ఉదయం 8గంటల నుంచి అమలు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఢిల్లీ నగరంలోకి నిత్యావసర వస్తువులు, సర్వీసులు అందించే ట్రక్కులు మినహా భారీ వాహనాలకు ప్రవేశాన్ని నిలిపివేయాలని సీఏక్యూఎం ఆదేశాలు జారీ చేసింది. ఎల్‌ఎన్‌జీ, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్, బీఎస్-4 డీజిల్ ట్రక్కులకే పర్మిషన్ ఇవ్వాలని పేర్కొంది. Also Read: Hyderabad Food: ఫుడ్ క్వాలిటీలో హైదరాబాద్ లాస్ట్...! హైవేలు, రోడ్లు, ఫ్లైఓవర్ వంతెనలు, పవర్ లైన్‌లు, పైపులైన్‌లు.. ఇలా నిర్మాణ సంబంధిత ప్రాజెక్టులను తాత్కాలికంగా నిలిపివేయాలని చెప్పింది. ఇప్పటికే 1 నుంచి ఐదో తరగతి వరకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని అధికారులు తెలిపారు. తాజాగా 6 నుంచి 9, 11 తరగతుల విద్యార్థులకు దాన్ని వర్తింపజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఈ నేపథ్యంలో తదుపరి ఆదేశాలు వచ్చేవరకు అన్ని పాఠశాలలకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని ఢిల్లీ సీఎం ఆతిశీ పేర్కొన్నారు. Also Read: AP: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం... రైతుల కోసం వాట్సాప్ నెంబర్..! అలాగే, ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఆఫీసులన్నీ 50శాతం ఆక్యూపెన్సీతో పని చేసేలా చూడాలని.. మిగతా వారికి వర్క్‌ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని సీఏక్యూఎం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సైతం వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వొచ్చని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు కాలేజీలను మూసివేయడంతో పాటు సరి-బేసి వాహన నిబంధనలు అమలు చేయడంపై నిర్ణయం తీసుకోవాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ ఆదేశాలు జారీ చేస్తుంది. #air-pollution #delhi-pollution #air-quality-index #GRAP 4 restrictions మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి