పోటా పోటీగా మహారాష్ట్ర ఎన్నికలు.. అధికారంలోకి వచ్చేది ఎవరంటే ? మెఘా లోక్‌పోల్ అనే ప్రీ పోల్ సర్వే.. మహారాష్ట్ర ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి గెలిచే అవకాశం ఉందని వెల్లడించింది. మరో సర్వే ఈసారి ఎన్నికల్లో మహాయుతి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలిపింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 18 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Maharashtra Assembly Elections 2024 మరో రెండు రోజుల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మహా వికాస్ అఘాడి, మహాయుతి కూటమిల మధ్య గట్టి పోటీ నెలకొంది. మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్రలో ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారనే దానిపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లు రెండుగా విడిపోవడం వల్ల ఈ ఎన్నికల ఫలితాలు మరింత ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం మహాయుతి కూటమిలో.. కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం), ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) పార్టీలు ఉన్నాయి. ఇక మహా వికాస్ అఘాడి కూటమిలో బీజేపీ, శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం), ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) పార్టీలు ఉన్నాయి. Also Read: పోలీసులను చితకొట్టిన అఘోరి.. ఈడ్చుకెళ్లి DCMలో పడేసి ఏం చేశారంటే? అయితే మహారాష్ట్ర మెఘా లోక్‌పోల్ అనే ప్రీ పోల్ సర్వే.. ఈ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి గెలిచే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ కూటమికి 151 నుంచి 162 అసెంబ్లీ సీట్లు వచ్చే అవకాశం ఉందని తన సర్వేలో తెలిపింది. ఇక మహాయుతి కూటమికి 115 నుంచి 128 మధ్య సీట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు చెప్పింది. మిగతా 5-14 స్థానాల్లో ఇతరులు గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. మహా వికాస్ అఘాడికి 43 - 46 శాతం ఓట్ షేర్ ఉండగా.. మహాయుతి కూటమికి 37 - 40 శాతం ఓట్ షేర్ ఉన్నట్లు తెలిపింది. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలు ఉండటం వల్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 145 స్థానాల్లో గెలవాలి. అయితే ఈ లోక్‌పోల్ సర్వే.. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 3 వేల శాంపిల్స్‌ను తీసుకుంది. మొత్తంగా 86, 400 శాంపిల్స్ తీసుకొని ఈ సర్వే నిర్వహించింది. అయితే ఇంతకుముందు జరిగిన ఎన్నికల్లో ఈ లోక్‌పోల్ చేసిన ప్రీ పోల్ సర్వే ఫలితాలు తారుమారయ్యాయి. ఇటీవల జరిగిన హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తోందని చెప్పింది. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చింది. అలాగే మధ్యప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఈ సర్వే చెప్పింది. కానీ ఇక్కడ కూడా బీజేపీ అధికారంలోకి వచ్చింది. Also Read: అతి తక్కువ టైంలో లక్ష లైక్స్ అందుకున్న టాలీవుడ్ ట్రైలర్స్ ఇదిలాఉండగా.. ఇటీవలే మరో ఒపినియన్ పోల్ అయిన మాట్రిజ్ అనే సర్వే ఈసారి ఎన్నికల్లో మహాయుతి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలిపింది. ఈ కూటమికి 145 నుంచి 165 సీట్ల మధ్య వస్తాయని అంచనా వేసింది. ఇక మహా వికాస్ అఘాడి కూటమికి 106 నుంచి 126 మధ్య సీట్లు వస్తాయని పేర్కొంది. మహాయుతికి 47 ఓటింగ్ శాతం, మహా వికాస్ అఘాడి కూటమికి 41 ఓటింగ్ శాతం వస్తుందని అంచనా వేసింది. అక్టోబర్ 10 నుంచి నవంబర్ 9 మధ్య జరిగిన ఈ సర్వేకు మొత్తం 1,09,628 మంది సహకరించారు. మొత్తంగా చూసుకుంటే ఈ రెండు కూటమిల మధ్య గట్టి పోటీ ఉన్నట్లు కనిపిస్తుంది. Also Read: పరువు పోతుందనే లగచర్లలో రేవంత్ కుట్ర..ఈటల సంచలన ఆరోపణలు! మరోవైపు చిన్న పార్టీల ప్రభావం కూడా ఉంటుందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఎంఐఎం, రాజ్ ఠాక్రే సారథ్యంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (MNS), వీబీఐ లాంటి చిన్న పార్టీలు, ఇండిపెండెంట్లకు కలిపి 30కి పైగా సీట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ హంగ్ వస్తే వీరే కింగ్ మేకర్లు అవుతారు. గత ఎన్నికల్లో 29 మంది చిన్న పార్టీల అభ్యర్థులు విజయం సాధించారు. మహా వికాస్ అఘాడి కూటమికి MNS పార్టీ టెన్షన్ పెడుతోంది. మొత్తం 125 సీట్లలో ఆ పార్టీ పోటీ చేస్తోంది. Also Read: Hyderabad Food: ఫుడ్ క్వాలిటీలో హైదరాబాద్ లాస్ట్...! ముంబై శివారులో MNS పార్టీ ఊపు మీద ఉంది. 25 సీట్లలో అక్కడ ప్రత్యర్థులకు టఫ్ ఫైట్ నడుస్తోంది. మరో 36 సీట్లలో కూడా ఆ పార్టీ దూకుడు చూపిస్తోంది. ఎంఎన్ఎస్ పార్టీకి బీజేపీ మిత్రపక్షంగా పేరుఉంది. ఇక ఠాక్రే కుమారుడు అమిత్ పోటీ చేస్తున్న మాహింలో షిండే సేన అభ్యర్థిని కాదని.. అమిత్‌కే నేరుగా సపోర్ట్ చేస్తున్నారు. ముస్లిం ఓటర్లు ఉన్న 19 సీట్లలో ఎంఐఎం పోటీ చేస్తోంది. ఇది మహా వికాస్ అఘాడి విజయావకాశాలకు గండి కొట్టనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 20న పోలింగ్ జరగనుండగా.. ఆ రోజున ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. నవంబర్ 23 న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇక ఎవరు అధికారంలోకి వస్తారంటే మరికొన్ని రోజుల పాటు వేచి చూడాల్సిందే. #maharashtra Assembly Elections 2024 #telugu-news #national-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి