/rtv/media/media_files/2025/11/19/sabari-crime-2025-11-19-16-00-05.jpg)
Sabari Crime
కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల అయ్యప్ప ఆలయం(Sabarimala Ayyappa Temple) వద్ద తాజాగా అపశ్రుతి చోటుచేసుకుంది. స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్(Sabari queue line)లో వేచి ఉన్న ఒక మహిళా భక్తురాలు అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి మృతి చెందారు. అయ్యప్ప భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆలయం వద్ద రద్దీ విపరీతంగా పెరిగింది.
క్యూలైన్‌లో మహిళా భక్తురాలు..
ప్రాథమిక సమాచారం ప్రకారం.. తీవ్రమైన రద్దీ కారణంగా, సుదీర్ఘ సమయం పాటు క్యూలో నిరీక్షించడం వల్ల భక్తురాలు అస్వస్థతకు గురై కుప్పకూలిపోయినట్లు తెలుస్తోంది. మృతురాలిని కోజికోడ్ జిల్లా కోయిలాండికి చెందిన 58 ఏళ్ల సతిగా గుర్తించారు. ఆమె మృతదేహాన్ని దేవస్వం బోర్డు ఖర్చులతో అంబులెన్స్‌లో ఆమె స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు చైర్మన్ కె. జయకుమార్ తెలిపారు. ఈ సంఘటన నేపథ్యంలో.. శబరిమల ఆలయంలో భక్తుల కోసం చేసిన ఏర్పాట్లపై కేరళ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇటీవల కాలంలో భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగిన నేపథ్యంలో.. దానికి అనుగుణంగా సరైన ఏర్పాట్లు చేయడంలో ఆలయ నిర్వహణ విఫలమైందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇది కూడా చదవండి: ఛీ.. చీ ఇదేం పని.. అయ్యప్ప మాలలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సర్వేయర్
క్యూలైన్లలో ఎక్కువ సమయం నిరీక్షించకుండా, భక్తులకు కనీస వసతులు, వైద్య సాయం, మెరుగైన రద్దీ నియంత్రణ వ్యవస్థను అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. భక్తుల రద్దీ కారణంగా అయ్యప్ప దర్శనానికి వేచి ఉండే సమయం 10 గంటలకు పైగా పెరుగుతోందని, దీనివల్ల వృద్ధులు, మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హైకోర్టు దృష్టికి వచ్చింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు, సంబంధిత ప్రభుత్వ విభాగాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. భక్తుల భద్రత, సౌకర్యాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని హైకోర్టు సీరియస్‌గా చెప్పింది.
ఇది కూడా చదవండి: జాజ్ చేయాలని భర్త, ప్రెగ్నెన్సీ కావడం లేదని అత్త వేధింపులు.. పాపం చివరికి!
Follow Us