తెలంగాణలో 9 యూనివర్శిటీలకు వీసీల నియామకం
తెలంగాణ ప్రభుత్వం 9 విశ్వవిద్యాలయాలు వైస్ ఛాన్సలర్లను నియమించింది. ఈ మేరకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఏ వర్శిటీకి ఎవరిని నియమించారో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి.
తెలంగాణ ప్రభుత్వం 9 విశ్వవిద్యాలయాలు వైస్ ఛాన్సలర్లను నియమించింది. ఈ మేరకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఏ వర్శిటీకి ఎవరిని నియమించారో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి.
మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పించాలని హైకమాండ్ నుంచి సీఎం రేవంత్ కు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. ఆ స్థానంలో మరో బీసీకి అవకాశం ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. మరో నలుగురికి కూడా మంత్రివర్గంలోకి ఛాన్స్ దక్కే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.
ఉన్నత పదవిలో ఉన్నానన్న సంగతి మరిచి కుమారుడి ఉన్నత చదువు కోసం దొంగ సర్టిఫికెట్ సమర్పించి అడ్డంగా దొరికిపోయాడు సూర్యాపేట డిప్యూటీ DMHO కర్పూరం హర్షవర్థన్. ఆ తప్పుడు క్యాస్ట్ సర్టిఫికెట్‌ను రద్దు చేస్తూ కలెక్టర్ గెజిట్ విడుదల చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సరికొత్త వివాదం రాజుకుంది. ‘నేను త్యాగం చేస్తేనే ఆయనకు సీఎం పదవి వచ్చింది. నాకే హెలికాప్టర్ లేదంటారా?’ అని మంత్రి కోమటిరెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మంత్రి సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ కీలక బాధ్యతలను అప్పగించింది. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ వీరిని పరిశీలకులుగా నియమించింది. మరఠ్వాడ ప్రాంతానికి ఉత్తమ్, నార్త్ మహారాష్ట్రకు సీతక్కను అబ్జర్వర్లుగా నియమించింది.
దసరా పండున నేపథ్యంలో అక్టోబర్ ఒకటి నుంచి 11వ తేదీ వరకు తెలంగాణలో రూ.1057 కోట్లు విలువైన మద్యం అమ్మకాలు జరిగాయని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే 25 శాతం వరకూ అమ్మకాలు పెరిగినట్లు తెలుస్తోంది.
దసరా పండుగ కోసం భాగ్య నగరాన్ని విడిచి వెళ్లిన వారంతా కూడా తిరిగి నగరానికి తిరిగి వస్తుండడంతో రోడ్లన్ని రద్దీగా మారాయి. పంతంగిలోని టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. దీంతో అధికారులు వాహనాల రద్దీకి అనుగుణంగా టోల్‌బూత్‌లను ఏర్పాటు చేశారు
మిర్యాలగూడ వేములపల్లి రావువారిగూడానికి చెందిన సైదులు అనుమానంతో తన భార్యను కాలువలో నూకి చంపేశాడు. కాలువలో కొట్టుకుపోయిందని పోలీసులకు తెలపగా.. అనుమానం వచ్చిన పోలీసులు విచారణ చేయగా నేరాన్ని ఒప్పుకున్నాడు.
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనతో మళ్లీ మంత్రివర్గ విస్తరణపై చర్చ మొదలైంది. దసరా తర్వాత కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి వర్గంలో మరో ఆరుగురికి ఛాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం.మళ్లీ ఒకటి లేదా రెండు శాఖలు ఖాళీ ఉంచుతారని తెలుస్తోంది.