వైద్య రంగంలో కొత్త విధానం.. డ్రోన్లతో వైద్య సేవలు ప్రారంభించిన బీబీనగర్ ఎయిమ్స్ యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్‌లో మంగళవారం డ్రోన్ సేవలను అధికారికంగా ప్రారంభించారు. వివిధ ఆరోగ్య కేంద్రాల్లో ఉండే వ్యాధుల నిర్ధారణకు సంబంధించిన శాంపిల్స్‌ను తీసుకురావడానికి ఈ డ్రోన్లను వినియోగించనున్నారు. By B Aravind 30 Oct 2024 in తెలంగాణ ఆంధ్రప్రదేశ్ New Update షేర్ చేయండి యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ వైద్యరంగంలో సరికొత్త మార్పునకు ముందడుగు వేసింది. మంగళవారం ఇక్కడ డ్రోన్ సేవలను అధికారికంగా ప్రారంభించింది. వివిధ ఆరోగ్య కేంద్రాల్లో ఉండే వ్యాధుల నిర్ధారణకు సంబంధించిన శాంపిల్స్‌ను తీసుకురావడానికి ఈ డ్రోన్లను వినియోగించనున్నారు. ప్రధానమంత్రి మోదీ ఢిల్లీలో ఏఐఐఏ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఎయిమ్స్ ఆడిటోరియంలోని డెరెక్టర్ వికాస్ భాటియా నేతృత్వంలో ఏర్పాటు చేసిన తెరపై ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. Also Read: హర్షసాయికి బిగ్ రిలీఫ్.. హైకోర్టు ముందస్తు బెయిల్ పీహెచ్‌సీకి డ్రోన్లు ధన్వంతరి జయంతి, 9వ ఆయుర్వేద దినోత్సవాల సందర్భంగా ప్రధాని మోదీ.. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలో మొత్తం దేశవ్యాప్తంగా రూ.12,850 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇందులో భాగంగానే బీబీనగర్ ఎయిమ్స్ డ్రోన్ కార్యకలాపాలను ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు. వికాస్ భాటియా ఎయిమ్స్ సమీపంలో డ్రోన్ల గురించి వివరించారు. రెండు డ్రోన్లను పరిశీలించారు. దగ్గర్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు (PHC)లకు ఈ రెండు డ్రోన్లను పంపిచారు. అక్కడి నుంచి సిబ్బంది పంపిన టీబీ నమూనాలను టెస్టు చేసేందుకు తీసుకున్నారు. ఇదిలాఉండగా.. ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్‌లో నిర్వహించిన ప్రయోగం కూడా సక్సెస్ అయ్యింది. మంగళగిరి నుంచి దాదాపు 15 కిలోమీటర్ల దురంలో ఉన్న కొత్త పీహెచ్‌సీ నుంచి సేకరించిన బ్లడ్ శాంపిల్స్‌ను డ్రోన్ ద్వారా తీసుకొచ్చారు. ఇకనుంచి రక్తనమునాలతో పాటు ఇతర అత్యవసర వైద్య సేవల్ని కూడా డ్రోన్ సాయంతో అందించవచ్చని ఆస్పత్రి సంచాలకులు పేర్కొన్నారు. Also Read: రేవంత్ సర్కార్‌కు బిగ్ షాక్.. కులగణనకు బ్రేక్ వాస్తవానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సిబ్బంది వెళ్లి రక్త నమూనాలను తీసుకురావాలంటే దీనికి చాలా సమయం పడుతుంది. ఇకనుంచి వాళ్ల అవసరం లేకుండానే ల్యాబ్ పరీక్షలు పూర్తి అయిన వెంటనే రిపోర్టులు, ఔషధాలు, ఇంజక్షన్లు డ్రోన్‌లో పంపిస్తున్నారు. దీనివల్ల సమయం, మానవ వనరులు ఆదా అవుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ డ్రోన్లతో 40 నుంచి 45 కిలోమీటర్ల దూరం నుంచి శాంపిల్స్‌ను సేకరించవచ్చని పేర్కొన్నారు. #medical #drones #AIIMS Bibinagar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి