TG Crime: దీపావళి వేళ నల్గొండలో దారుణం.. ఇద్దరు పిల్లలను చంపిన తల్లి.. ఆ తర్వాత ఏం చేసిందంటే..?

నల్గొండ జిల్లా కొండమల్లే వైట్ మార్కెట్ వద్ద ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులను హత్య చేసి ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు బాపట్ల జిల్లా జనకవరం గ్రామానికి చెందిన కుంచాల నాగలక్ష్మి కుమార్తె అవంతిక, కుమారుడు భవన్ సాయిగా పోలీసులు గుర్తించారు.

New Update
_Nalgonda Crime News

Nalgonda Crime News

నల్గొండ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కొండమల్లే గ్రామ శివారులోని వైట్ మార్కెట్ వద్ద ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులను హత్య చేసి ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దారుణం సోమవారం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య.. 

మృతులు బాపట్ల జిల్లా జనకవరం గ్రామానికి చెందిన కుంచాల నాగ లక్ష్మి (27), ఆమె కుమార్తె అవంతిక (9), కుమారుడు భవన్ సాయి (7)గా పోలీసులు గుర్తించారు. ప్రాథమిక విచారణలో భాగంగా.. కుటుంబ కలహాల కారణంగానే తల్లి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నాగ లక్ష్మి ముందుగా తన ఇద్దరు పిల్లలను హత్య చేసి.. ఆ తర్వాత తానూ బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: సచివాలయంలో భారీ మోసం.. మంత్రి పేషీ పేరుతో కోట్లు కాజేసిన కేటుగాళ్లు

ఈ ఘటనతో జనకవరం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ ఘటనకు గల పూర్తి కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. మృత దేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులను విచారించి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ముగ్గురు మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ, ఏపీలో కొత్త వైరస్ కలకలం.. ఒల్లంతా బొబ్బలు.. భయం భయం!

Advertisment
తాజా కథనాలు