/rtv/media/media_files/2025/10/20/new-virus-2025-10-20-11-20-03.jpg)
new virus
కరోనా వైరస్ తర్వాత ప్రజలకు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ఏ చిన్న సమస్యలు వచ్చినా.. వెంటనే శ్రద్ధ తీసుకుంటారు. అయితే కరోనా వైరస్ ప్రజలను ఎంతగా ప్రభావితం చేసిందో మాటల్లో చెప్పలేం. అప్పటి నుంచి ఈ ప్రకృతిలో ఏదో వైరస్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. తాజాగా ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో ఒక చిన్నారికి శరీరమంతా బొబ్బలు, తీవ్రమైన దురదతో కూడిన వింత వ్యాధి సోకడం స్థానికులను, అధికారులు కలవర పడుతున్నారు. చిన్నారికి ఈ వింత వ్యాధి వచ్చిందన్న ప్రచారం జిల్లాలో ఆందోళన కలిగించింది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన జిల్లా అధికారులు వెంటనే స్పందించి.. ఆ చిన్నారిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి (GGH)కి తరలించి చికిత్స అందించారు. చికిత్స అనంతరం చిన్నారిలో ఇన్ఫెక్షన్ తగ్గిందని వైద్యులు తెలిపారు.
విచిత్రమైన వ్యాధి..
అయితే.. ఈ వ్యాధి ఎలా సోకిందనే దానిపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఇన్ఫెక్షన్ ఇంకెవరికైనా సోకిందా, లేక అక్కడికే పరిమితమైందా అనే కోణంలో గ్రామంలో అంతర్గత సర్వే కూడా నిర్వహిస్తున్నారు. సమాచారం మేరకు.. ఆ చిన్నారి ఖమ్మం జిల్లాలోని బంధువుల ఇంటికి వెళ్లి వచ్చినట్లు తెలిసింది. దీంతో ఖమ్మం జిల్లాతో దీనికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో పారిశుద్ధ్య లోపం వల్లే ఇలాంటి ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: తీర్థయాత్రకు వెళ్లివస్తుండగా.. రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి
బ్రేకింగ్
— Telugu Feed (@Telugufeedsite) October 19, 2025
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో వైరస్ కలకలం
చిన్నారులకు వైరల్ ఇన్ఫెక్షన్.. కాళ్లు, చేతులపై బొబ్బలు
గ్రామంలో పర్యటిస్తున్న DMHO సుహాసిని.. చికిత్స కోసం చిన్నారులు విజయవాడ GGHకి తరలింపు
పెనుగంచిప్రోలులో ఇప్పటికే వైద్యశిబిరం ఏర్పాటు.. కొనసాగుతున్న పారిశుధ్య… pic.twitter.com/kuwezpCu0f
చిన్నారికి సోకిన ఈ వ్యాధి పట్ల ఆందోళన చెందకుండా.. చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు పెనుగంచిప్రోలు ప్రజలకు సూచించారు. ఇందులో భాగంగా.. పారిశుద్ధ్య కార్మికులు బ్లీచింగ్ పౌడర్‌తో శానిటైజేషన్ పనులు చేపట్టారు. ఈ వింత వ్యాధి వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు.. ముఖ్యంగా పిల్లలకు దూరంగా ఉండాలని అధికారులు కోరారు.
ఇది కూడా చదవండి: పరువు హత్య.. 9 నెలల గర్భిణిని గొడ్డలితో నరికి చంపేసిన మామ