CM Revanth-Mandakrishna: మందకృష్ణతో భేటీ.. ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ కీలక సూచనలు!

ఎస్సీ వర్గీకరణ అంశంపై సమస్యలు, అభ్యంతరాలను కేబినెట్ సబ్ కమిటీతో పాటు కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మార్పీఎస్ చీఫ్ మందకృష్ణకు సూచించారు. ఈ రోజు సీఎం రేవంత్ ను మందకృష్ణ కలిశారు. వర్గీకరణపై సీఎం కమిట్మెంట్ ను అభినందించారు.

New Update

కమిట్మెంట్ తో వర్గీకరణ ప్రక్రియను చేపట్టిన ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి ఒక సోదరుడిగా అండగా ఉంటానని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రకటించారు. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డితో మందకృష్ణ భేటీ అయ్యారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిట్మెంట్ ను ఈ సందర్భంగా మందకృష్ణ అభినందించారు. ఉపకులాల వర్గీకరణలో పలు సమస్యలను సీఎంకు వివరించారు.
ఇది కూడా చదవండి: BRS : టార్గెట్ సీఎం రేవంత్... ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పెద్ద స్కెచ్!

మాదిగలకు మేలు చేయడమే లక్ష్యం..

రాజకీయ ప్రయాజనాలకు అతీతంగా, మాదిగ, మాదిగ ఉపకులాలకు మేలు చేయాలనే  మంచి లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఉందని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మందకృష్ణకు స్పష్టం చేశారు. అసెంబ్లీలో చర్చించి, కేబినెట్ సబ్ కమిటీ వేసి, న్యాయ కమిషన్ వేసి, నివేదికలను వేగంగా తీసుకుని, కేబినెట్ లో చర్చించి, అసెంబ్లీలోనే నిర్ణయం తీసుకున్నామని వివరించారు. దీనివల్ల ఎలాంటి న్యాయ పరమైన చిక్కులు లేకుండా చేశామన్నారు. వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కొట్లాడిన విషయాన్ని ప్రతినిధులు గుర్తు చేశారు. 
ఇది కూడా చదవండి: Maoist: మావోయిస్టులపై లాస్ట్ ఆపరేషన్.. PLGA ఆవాసంలోకి చొచ్చుకెళ్లిన భద్రతా బలగాలు!

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ను అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మందకృష్ణ స్వాగతించారు. కానీ.. మాదిగలు ఉన్న గ్రూప్ కు 11 శాతం దక్కాల్సిన రిజర్వేషన్లను 9కి తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు. నేతకాని సమాజిక వర్గాన్ని మాలలు ఉన్న గ్రూపులో కలపడం కూడా సరికాదన్నారు.  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు