Blood Moon: ఆదివారం ఆకాశంలో అద్భుతం.. ఆ రోజు రక్తంతో నిండిన చంద్రుడు!!

వచ్చే ఆదివారం, సెప్టెంబర్ 7న ఆకాశంలో ఓ అద్భుతమైన జరగనుంది. ఆరోజు భాద్రపద పూర్ణిమ సందర్భంగా సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం సమయంలో చంద్రుడు పూర్తిగా ఎర్రటి రంగులోకి మారి "బ్లడ్ మూన్"గా కనిపించనున్నాడు.

New Update
Blood moon

వచ్చే ఆదివారం, సెప్టెంబర్ 7న ఆకాశంలో ఓ అద్భుతమైన జరగనుంది. ఆరోజు భాద్రపద పూర్ణిమ సందర్భంగా సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం సమయంలో చంద్రుడు పూర్తిగా ఎర్రటి రంగులోకి మారి "బ్లడ్ మూన్"గా కనిపించనున్నాడు. ఈ అరుదైన దృశ్యాన్ని భారతదేశంతో సహా అనేక దేశాల ప్రజలు వీక్షించే అవకాశం ఉంది.

సంపూర్ణ చంద్ర గ్రహణం

ఇండియన్ టై ప్రకారం.. ఈ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7న రాత్రి 9:58 గంటలకు ప్రారంభమై, సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 1:26 గంటల వరకు కొనసాగనుంది. ఈ సంపూర్ణ చంద్ర గ్రహణం సుమారు 82 నిమిషాల పాటు ఉంటుంది. ఈ సమయంలో చంద్రుడు ఎర్రటి కాంతితో ప్రకాశిస్తాడు.

"బ్లడ్ మూన్" 

సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖపైకి వస్తారు. ఈ క్రమంలో సూర్యకాంతి భూమి వాతావరణం గుండా ప్రయాణించి, వక్రీభవనం చెందుతుంది. దీనివల్ల ఎక్కువ తరంగదైర్ఘ్యం ఉన్న ఎరుపు, ఆరెంజ్ లైట్ మాత్రమే చంద్రుడిని చేరుకుంటుంది. ఈ కారణంగానే చంద్రుడు మనకు ఎర్రగా కనిపిస్తాడు. ఈ అరుదైన దృశ్యాన్నే "బ్లడ్ మూన్" అని పిలుస్తారు.

ఈ సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశం అంతటా కనిపిస్తుంది. ముఖ్యంగా, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పూణే, లక్నో, జైపూర్, చండీగఢ్, అహ్మదాబాద్, భువనేశ్వర్, గౌహతి వంటి ప్రధాన నగరాలతో పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆకాశం నిర్మలంగా ఉంటే ఈ అద్భుతమైన దృశ్యాన్ని స్పష్టంగా చూడవచ్చు.

సూతక కాలం

ఖగోళ శాస్త్రం ప్రకారం ఇది ఒక సహజ ప్రక్రియ అయినప్పటికీ, భారతీయ జ్యోతిష్యం ప్రకారం చంద్రగ్రహణానికి సూతక కాలం వర్తిస్తుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి, సూతక కాలం ఆదివారం మధ్యాహ్నం 12:57 గంటలకు ప్రారంభమై గ్రహణం ముగిసే వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో ఆహారం తీసుకోవడం, దేవాలయాల దర్శనం, శుభకార్యాలు వంటివి చేయకూడదని పండితులు సూచిస్తున్నారు. గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి, దైవారాధన చేయడం మంచిదని చెబుతున్నారు.

Advertisment
తాజా కథనాలు