AP Govt: ఏపీ సర్కార్ కొత్త చట్టం.. తప్పుడు పోస్టులు పెడితే జైలుకే!

ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. మంత్రులు అనిత,  నాదెండ్ల మనోహర్,  పార్థసారధి, అనగాని సత్యప్రసాద్ లతో మంత్రి  వర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది.

New Update
Ap govt

AP Govt: ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. మంత్రులు అనిత,  నాదెండ్ల మనోహర్,  పార్థసారధి, అనగాని సత్యప్రసాద్ లతో మంత్రి  వర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టె వారిపై  కఠిన చర్యలు తీసుకోవాలని, కొత్త చట్టాలపై సబ్ కమిటీ చర్చించనుంది. కొత్త చట్టం తీసుకొచ్చేందుకు నిబంధనల రూపకల్పనకు కృషిచేయనుంది ఉపసంఘం. సోషల్ మీడియా పోస్టులకు ఆధార్ అకౌంటబిలిటీ ఉండేలా చట్టం ఉండాలనే అంశంపై కూడా సీఎం చర్చించారు. 

Also Read: ఆదివారం ఆకాశంలో అద్భుతం.. ఆ రోజు రక్తంతో నిండిన చంద్రుడు!!

కఠిన చర్యలు ఉండేలా చట్టం

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు ఉండేలా చట్టం ఉండాలన్నారు సీఎం చంద్రబాబు(CM Chandrababu).  మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించిన విషయాన్ని సీఎం ప్రస్తావించారు. సుగాలి ప్రీతి కుటుంబానికి అండగా ఉన్నందుకు తనను టార్గెట్ చేస్తున్నారని పవన్ అన్నారు. స్వార్థ రాజకీయాల కోసం చేసే విషప్రచారాన్ని ధీటుగా తిప్పికొడదామని  పవన్ తెలిపారు. ఇక యూరియాపై జరుగుతున్న దుష్ప్రచారంపైనా మంత్రులతో సీఎం చర్చించారు. రాష్ట్రంలో ఎరువులకు ఇబ్బంది లేకున్నా వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని చంద్రబాబు మండపడ్డారు. సరైన సమయంలో వైసీపీ నేతల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టలేదని సీఎం మండిపడ్డారు. ఇకనుంచి ఇలాంటి దుష్ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. 

Also Read :  Crime news: కసాయి పనికి ఒడిగట్టిన కన్న తండ్రి.. ముగ్గురు పిల్లల్ని చంపి తాను కూడా చివరికి..

Advertisment
తాజా కథనాలు