/rtv/media/media_files/2025/05/20/GDoqm48gIydaYSMZ24JC.jpg)
National Investigation Agency (NIA)
Vizianagaram Case: విజయనగరం, హైదరాబాద్ కేంద్రాలుగా సాగిన ఉగ్ర కుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కేవలం హైదారాబాద్ మాత్రమే కాకుండా తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటకలోనూ పేలుళ్లకు నిందితులు కుట్ర పన్నినట్లు ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. హైదరాబాద్ బోయగూడలో నివాసం ఉండే సమీర్ అల్- హింద్ ఇత్తేహదుల్ ముసల్మాన్ పేరుతో ఓ గ్రూపును ఏర్పాటు చేశాడు. ఈ సంస్థలోకి పలువురిని సభ్యులుగా చేర్చుకున్నాడు. అలా మొత్తం ఆరుగురు సభ్యులతో తన కార్యకలపాలను విస్తరించేందుకు ప్రయత్నించాడు.
Also Read : బార్డర్లో వరంగల్ జవాన్ ఆత్మహత్య.. తుపాకీతో కాల్చుకుని.. కారణం అదేనా?
ఈ సంస్థలో సభ్యునిగా చేరిన సిరాజ్ 2017లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఎస్సై సెలక్షన్స్ కోసం హైదరాబాదులో శిక్షణ కోసం వచ్చాడు. రెండు సార్లు ఎస్సై కోసం ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. సిరాజ్ తండ్రి విజయనగరం రూరల్ స్టేషన్‌లో ఏఎస్సైగా పనిచేస్తుండగా, తమ్ముడు ఎస్డీఎఫ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తుండటం గమనార్హం. వారిదారిలోనే పోలీస్ ఉద్యోగం సంపాదించాలనుకున్న సిరాజ్ ప్రయత్నాలు విఫలమవ్వడం తో గ్రూపు వన్ కోసం ట్రైనింగ్ తీసుకున్నా సెలక్ట్ కాలేదు. ఆ తరవాత కొంతకాలం 108లో టెలికాలర్‌గా పనిచేశాడు. తన ప్రయత్నాలు విఫలమవ్వడంతో కొంత అసంతృప్తిగా ఉన్నాడు.
Also Read : విజయవాడ, బెంగళూరు మధ్య వందే భారత్..తొందరలోనే
గ్రూపువన్ శిక్షణ తీసుకుంటున్న సమయంలోనే బోయగూడలో ఉంటున్న సయ్యద్ సమీర్‌తో పరిచయం ఏర్పడింది. సమీర్ ద్వారా వరంగల్‌కు చెందిన పరహాన్ మొయినుద్దీన్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన బాదర్‌తోనూ పరిచయాలు అయ్యాయి. అంతా ఒకే మత సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో సామాజిక మాద్యమాల్లో ఓ వర్గానికి జరుగుతున్న అన్యాయాలపై వీరంతా చర్చించేవారు. గత ఏడాది నవంబర్ 22న సమీర్, సిరాజ్ ముంబైకి వెళ్లారు.అక్కడ అద్నాన్ కురేసి, దిల్షాన్, మొహిషిన్ షేక్, జహీర్ అలియాస్ అమన్ కలిసి ఓ లైవ్ షోకు హాజరయ్యారు. ఆ తర్వాత షహబాజ్, జీషన్ తదితరులను కలిసేందుకు జనవరి 26న ఢిల్లీ వెళ్లిన సమీర్.. షహబాజ్ విదేశాలకు వెళ్లిపోవడంతో మండూలికి వెళ్లి సల్మాన్‌ను కలిసినట్లు దర్యాప్తు సంస్థలు తేల్చాయి.
Also Read : కేసీఆర్ కు జైలు తప్పదా? కాళేశ్వరం విచారణలో బిగ్ ట్విస్ట్!
కాగా వీరందరికీ సౌదీలో ఉంటున్న అబూ ముసబ్ అనే వ్యక్తి ఉగ్ర సమాచారం ఇవ్వడంతో పాటు ఎక్కడెక్కడ కుట్రలు చేయాలి, ఎలా చేయాలనే అంశంపై సమాచారం అందించేవాడు. దీనికోసం ఎవరికీ అనుమానం రాకుండా సిగ్నల్ యాప్‌లో మాట్లాడుకునేవారు. అదే క్రమంలో బాంబులు తయారీ గురించి వారికి అవగాహన కల్పించాడు. ముసబ్ ఆదేశాల మేరకు ఆన్‌లైన్ ద్వారా పేలుడు పదార్థాలను తెప్పించాడు సిరాజ్. అలాగే సమీర్ అమేజాన్‌లో తెప్పించిన టిఫిన్ బాక్సులు, వైర్లు ఇతర వస్తువుల ద్వారా బాంబులు తయారు చేయడంతో పాటు విజయనగరం జిల్లా రంపచోడవరం అటవీ ప్రాంతంలో ట్రయల్స్ కూడా చేశారని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇక్కడ ఒక వర్గం కోసం పనిచేస్తున్నామని నిర్ణయించుకున్న సిరాజ్, సమీర్‌లు జిహాదీ కోసం ప్రాణత్యాగం కూడా చేయాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు మొదలుపెట్టిన ఎన్ఐఏ వారిని కస్టడీకి కోరే అవకాశం ఉంది. విచారణలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
జిహాదీ చర్యల్లో భాగంగా అవసరమైతే ప్రాణత్యాగం చేయాలని సిరాజ్, సమీర్‌లు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తు మొదలైన నేపథ్యంలో ఈ ఇద్దరిని కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తోంది. ఇద్దరినీ కస్టడీలోకి తీసుకుంటే ఉగ్రకుట్రలకు సంబంధించి కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Also Read : బెంగళూరులో వర్షాలే వర్షాలు.. రన్నింగ్ బస్సుల్లోకి నీళ్లు.. వీడియోలు వైరల్!