జవాన్ ఆత్మహత్య..
జవాన్ నాగరాజు మృతితో నర్సంపేట గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం కుటుంబ కలహాలే జవాన్ నాగరాజు మృతికి కారణమని తెలుస్తోంది. నాగరాజుకు రెండేళ్ల క్రితమే పెళ్లయింది. ప్రస్తుతం నాగరాజు ఆత్మహత్యకు కారణం ఏంటి? అనే దానిపై అతడి కుటుంబ సభ్యులు, భార్య నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. మానసికంగా, శారీరకంగా ఎంతో దృడంగా ఉండే ఒక జవాన్.. ఇలా ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని పలువురు అంటున్నారు.