MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత సంచలన ప్రెస్‌ మీట్‌

బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెన్సన్‌ పై ఎమ్మెల్సీ కవిత సంచలన ప్రెస్‌ మీట్‌ పెట్టారు. తాను పార్టీ వ్యతిరేక కార్యకలపాలు నిర్వహిస్తున్నానన్నారు. గులాబీ కండువా కప్పుకుని ప్రజా సమస్యల పై పోరాటం చేయడం పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేయడమా అని కవిత ప్రశ్నించారు.

New Update
MLC Kavitha Press Meet

బీఆర్‌ఎస్‌(brs) నుంచి సస్పెన్సన్‌ పై ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) సంచలన ప్రెస్‌ మీట్‌(Pressmeet) పెట్టారు. తాను పార్టీ వ్యతిరేక కార్యకలపాలు నిర్వహిస్తున్నానని సస్పెండ్‌ చేశామని బీఆర్‌ఎస్‌ నాయకులు తెలిపారు. గులాబీ కండువా కప్పుకుని ప్రజా సమస్యల పై పోరాటం చేయడం పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేయడమా అని కవిత ప్రశ్నించారు.ఈ మేరకు బుధవారం ఉదయం మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. 
నన్ను సస్పెండ్‌ చేసినట్లు  నిన్న మీడియా ద్వారా తెలుసుకున్ననన్నారు. తీహార్‌ జైలు నుంచి వచ్చిన తర్వాత అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించాను. అలా చేయడం పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించినట్లా అని ప్రశ్నించారు.కానీ, పనికట్టుకుని నాపై దుష్ఫ్రచారం చేస్తున్నారు.  బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన సస్పెన్షన్ లేఖలో ప్రత్యేకంగా రెండు అంశాల గురించి మాట్లాడతానని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ‘ నాపై అక్రమ కేసులు పెట్టి తీహార్ జైల్లో ఐదున్నర నెలలు ఉంచారు. బయటకు రాగానే.. 2024, నవంబర్ 23వ తారీఖు నుంచి ప్రజా క్షేత్రంలోకి వచ్చి అనేక కార్యక్రమాలు చేస్తున్నాను. నేను చేసిన పనుల్లో మొట్టమొదటిది.. ఓ బిడ్డ హాస్టల్‌లో చనిపోతే అక్కడి వెళ్లాను. గురుకులాల్లో జరుగుతున్న అక్రమాల గురించి మాట్లాడాను. బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి.. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన 42 శాతం హామీ కోసం పెద్ద ఎత్తున పని చేశా. మహిళలకు 2500 ఇవ్వాలని పోస్టుకార్డు ఉద్యమం చేశాను’ అని కవిత వివరించారు.  

‘10 నెలల వ్యవధిలో 42 నియోజకవర్గాల్లో పర్యటించా. రాష్ట్రంలో ఏ మూల సమస్య ఉన్నా స్పందించా. పార్టీ కోసం నేను చేసిన సేవలను నాయకత్వం పునరాలోచన చేయాలి. నేను మాట్లాడుతున్నది పార్టీకి వ్యతిరేకంగా కాదు. పార్టీలో ఉన్న కొందరు నాపై కక్షగట్టారు. సామాజిక తెలంగాణ కోసం కట్టుబడి ఉన్నా.. అది తప్పా?. నేను ఏం తప్పుగా మాట్లాడాను.. సామాజిక తెలంగాణ అంటే బీఆర్ఎస్ వ్యతిరేకం ఎలా అవుతుంది?’ అని ప్రశ్నించారు.
‘కేటీఆర్‌ను గడ్డం పట్టుకుని అడుగుతున్నా. నాపై కుట్రలు జరుగుతుంటే వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మీరు ఏం చేశారు?. నాపై కుట్రలు జరుగుతున్నాయని చెప్పినా కేటీఆర్ నుంచి ఫోన్ కూడా రాలేదు. మహిళా నేతలు కూర్చోని నాపై ప్రెస్‌మీట్ పెట్టారు. అది మంచిదే.. అదే నేను కోరుకున్నది. కొందరు మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారు. అందుకే నన్ను పార్టీ నుంచి బయటపడేశారు. పార్టీని అస్తగతం చేసుకోవాలని కుట్రలు చేస్తున్నారు. రేపు కేటీఆర్‌కు ఇదే జరుగుతుంది.. కేసీఆర్‌కు ఇదే జరుగుతుంది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

జన్మనిచ్చిన తండ్రి చిటికన వేలు పట్టుకుని ఉద్యమాలు చేయడం చేర్చుకున్నానని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కానీ ఇద్దరు పని గట్టుకుని తపై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. హరీశ్ రావు, సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే.. బంగారు తెలంగాణ కాదని కామెంట్ చేశారు. చెల్లి, మహిళా ఎమ్మెల్సీపై ఆఫీసులో కుట్ర జరగుతోందని అన్న కేటీఆర్‌కు చెప్పానని.. 103 రోజులైనా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కనీసం తనను అడక్కపోవడం దారుణమని అన్నారు. బంధుత్వం పక్కనేన పెట్టి ఓ మహిళా ఎమ్మెల్సీని బాధపడుతుంటే అన్నగా కేటీఆర్ ఏం చేయలేదని ఆరోపించారు. కేవలం వ్యక్తిగత లబ్ధి కోరుకునే వ్యక్తులు పార్టీ నుంచి తనను బయటకు పంపారని ఆరోపించారు. రేపు కేటీఆర్, తన తండ్రిపై ఇంటాంటి కుట్రలే జరగొచ్చని కవిత ఫైర్ అయ్యారు.

Also Read :  మార్వాడీపై దాడి.. హైదరాబాద్ లో హైటెన్షన్!

ఎమ్మెల్సీ , పార్టీ సభ్యత్వానికి రాజీనామా..

బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కవిత సంచలన ప్రకటన చేశారు.

హరీష్‌ రావు పై తీవ్ర ఆరోపణలు
ఈ సందర్భంగా కవిత హరీష్‌రావు కేంద్రంగా సంచలన ఆరోపణలు చేశారు. ‘సీఎం రేవంత్(CM Revanth), హరీష్‌రావు(Harish Rao) ఒకే విమానంలో ప్రయాణించారు. రేవంత్ కాళ్లు హరీష్‌రావు పట్టుకున్నాకే ఈ కుట్రలు మొదలయ్యాయని ఆరోపించారు. హరీష్‌రావుకు పాల వ్యాపారం ఉండేది. అధికారంలోకి రాగానే హాస్టళ్లకు పాలు సరఫరా చేశారని ఆరోపణలున్నాయి. రూ.లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని రేవంత్ అన్నారు. కానీ హరీష్‌రావు గురించి మాట్లాడరు. కేసీఆర్‌ను మాత్రమే టార్గెట్ చేస్తారని ఆరోపించారు. కేసీఆర్‌(kcr) పై సీబీఐ విచారణ వచ్చిందంటే.. అందుకు కారణం హరీష్‌రావు, సంతోష్‌రావే అని తేల్చి చెప్పారు. కేసీఆర్‌తో మొదటి నుంచి హరీష్‌రావు లేరన్నారు. టీడీపీ నుంచి బయటకు వచ్చే సమయంలో కూడా..పార్టీ పెట్టుడు ఎందుకు ఈ నిర్ణయం అంటూ హరీష్‌రావు ప్రశ్నించారన్నారు. హరీష్‌రావు ట్రబుల్ షూటర్ కాదు.. డబుల్ షూటర్ అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు హరీష్‌రావు కట్టప్ప లాగా అంటారు. హరీష్‌రావు ఒక దశలో తన పక్కన ఎమ్మెల్యేలను పెట్టుకోవాలని చూశారు. హరీష్‌ రావు ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు నిధులు ఇచ్చారన్నారు. నా ప్రాణం పోయినా కేసీఆర్‌కు అన్యాయం జరగనివ్వను. నాపై ఇన్ని కుట్రలు, ఇన్ని అవమానాలు అవసరమా?’ అంటూ కంటతడి పెట్టుకున్నారు.

Also Read :  మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు బిగ్ రెయిన్ అలర్ట్!

Advertisment
తాజా కథనాలు