Attack on Marwadi: మార్వాడీపై దాడి.. హైదరాబాద్ లో హైటెన్షన్!

తెలంగాణ వ్యాప్తంగా మార్వాడీ గోబ్యాక్‌ ఉద్యమం బలపడుతున్న తరుణంలో హైదరాబాద్‌ నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఒక మార్వాడీ పై ఆర్కేపురం బీజేపీ కార్పొరేటర్‌ రాధ భర్త ధీరజ్‌ రెడ్డి దాడి చేశాడు.  అయితే ఈ దాడికి రాజకీయ విభేదాలే కారణమని తెలుస్తోంది.

New Update
Attack on Marwadi.. High tension in Hyderabad!

Attack on Marwadi.. High tension in Hyderabad!

తెలంగాణ వ్యాప్తంగా మార్వాడీ గోబ్యాక్‌(GO BACK MARWADI) ఉద్యమం బలపడుతున్న తరుణంలో హైదరాబాద్‌ నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఒక మార్వాడీ పై ఆర్కేపురం కార్పొరేటర్‌ రాధ భర్త ధీరజ్‌ రెడ్డి దాడి చేశాడు.  అయితే ఈ దాడికి రాజకీయ విభేదాలే కారణమని తెలుస్తోంది. బీజేపీలో నెలకొన్న గ్రూపు తగాదాలే ఈ దాడికి కారణమని తెలుస్తోంది. ఆర్కేపురంలో విజయ్‌ దేవడా అనే మార్వాడీ ఏర్పాటు చేసిన వినాయకుని దర్శనానికి సరూర్‌ నగర్‌ బీజేపీ కార్పొరేటర్‌ ఆకుల శ్రీవాణిని ఆహ్వానించాడు. ఈ క్రమంలో  తన అనుమతి లేకుండా మరో కార్పొరేటర్‌ను తన డివిజన్‌కు ఎలా పిలుస్తావంటూ తనపై దాడి చేశారని విజయ్ ఆరోపించారు. మహేశ్వరం అయిన, ఆర్‌కే పురంలో తన అనుమతి లేనిదే ఎవరు ఎలాంటి కార్యక్రమాలు చేయవద్దని ధీరజ్‌ రెడ్డి హుకుం జారీ చేశాడని ఆయన ఆరోపించారు.
ధీరజ్‌ రెడ్డితో పాటు మరో 20 మంది ఆయన అనుచరులు తనను కిడ్నాప్‌చేసి పార్టీ అఫీసుకు తీసుకువెళ్లి మెడకు పార్టీ కండువాలు బిగించి హత్య చేసే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. మార్వాడోడా నీకెందుకు రాజకీయం అంటూ తనను దూషించారని వాపోయాడు. ఈ సందర్భంగా ధీరజ్‌ రెడ్డితో పాటు ఆయన అనుచరులు విపరీతంగా కొట్టారని పేర్కొ్న్నాడు.

Also Read :   బీఆర్ఎస్ నుంచి కవిత ఔట్.. కొత్త పార్టీకి రిజిస్ట్రేషన్ కంప్లీట్.. పేరు ఇదే!

Attack On Marwadi

 విషయం తెలుసుకున్న తన తండ్రి, కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని తనను విడిపించి తీసుకువెళ్లి ఆస్పత్రిలో చేర్పించారని తెలిపాడు. రెండు రోజులు చికిత్స అనంతరం దిశ్చార్జ్‌ అయినట్లు వివరించాడు.  కాగా ధీరజ్‌ రెడ్డి దాడిలో తీవ్రంగా గాయపడ్డ విజయ్‌ మాట్లాడుతూ తనకు రాజకీయ మైలేజ్‌ వస్తుందన్న కక్ష్యతోను తనపై దాడి చేశారని ఆరోపించారు. తనకు ధీరజ్‌ రెడ్డితో ప్రాణభయం ఉందని విజయ్ ఆందోళన వ్యక్తం చేశాడు. కేవలం రాజకీయ కక్షతోని తనపై దాడి చేసిన ధీరజ్‌ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దీనిపై తను మానవహక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశానన్నారు. తను ఇకపై ఆర్కేపురంలో రాజకీయం చేస్తానని విజయ్‌ సవాల్‌ విసిరారు.

ఇది కూడా చూడండి:Weather Update: తెలుగు రాష్ట్రాలకు మళ్లీ పొంచి ఉన్న గండం.. వచ్చే నెల నుంచి ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు!

కాగా తెలంగాణలో కొంతకాలంగా మార్వాడీ గోబ్యాక్‌ ఉద్యమం సాగుతున్న నేపథ్యంలో మార్వాడీపై దాడి జరగడం సంచలనంగా మారింది. ముఖ్యంగా బీజేపీ కార్పొరేటర్‌ దాడిచేయడం చర్చనీయంశంగా మారింది. మార్వాడీ గో బ్యాక్ ఉద్యమాన్ని బీజేపీ(bjp leaders shocking reaction on marwadi go back issue) వ్యతిరేకిస్తోంది. ఆ పార్టీ రాష్ర్ట నాయకులతో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కూడా ఉద్యమాన్ని వ్యతిరేకిస్తున్నారు. అలాంటి తరుణంలో అదే పార్టీ నాయకులు మార్వాడీలపై దాడి చేయడాన్ని ఎలా సమర్థించుకుంటారనే ప్రశ్న తలెత్తుతుంది. కాగా విజయ్ పై దాడి విషయంలో మార్వాడీ వర్గాలతో పాటు స్థానికులు తీవ్రంగా ఖండిస్తున్నారు.

ఇది కూడా చదవండి:ఇన్‌స్టా ప్రియుడికోసం.. కట్టుకున్నోన్ని వదిలేస్తానన్న భార్య... కోపంతో భర్త ఏం చేశాడంటే?

Advertisment
తాజా కథనాలు