/rtv/media/media_files/2025/09/03/rains-in-telugu-states-2025-09-03-07-13-24.jpg)
Rains In Telugu States
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 48 గంటల్లో భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావం వల్ల ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఇది కూడా చూడండి: Chandra Grahan 2025: విచిత్రం.. చంద్ర గ్రహణాన్ని ఈ 15 నగరాల్లో స్పష్టంగా చూడొచ్చు..!
తెలంగాణలో ఈ జిల్లాలకు..
తెలంగాణ(Telangana) లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రాబోయే 24 గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆ తర్వాత భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అయితే గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, ఖమ్మం, కొమరంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, హనుమకొండ, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, సంగారెడ్డి, వరంగల్, వికారాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ అధికారులు జారీ చేశారు. భారీ వర్షాల వస్తాయని అధికారులు తెలియజేయడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.
TELANGANA LOW PRESSURE ALERT – 2nd & 3rd SEPTEMBER
— Hyderabad Rains (@Hyderabadrains) September 2, 2025
As anticipated, a Low Pressure Area has formed over the Bay of Bengal, but slightly closer to the Odisha Coast than expected.
TELANGANA IMPACT:
North & East Telangana – HEAVY to VERY HEAVY RAINS likely. (Refer to map below)… pic.twitter.com/RkukEKo9QS
ఇది కూడా చూడండి: HYD CRIME: అయ్యో బిడ్డా.. స్తంభం కూలి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
ఏపీలో ఈ జిల్లాల్లో..
ఏపీలో విజయనగరం, అనకాపల్లి, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, కాకినాడ, డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, నెల్లూరు, తిరుపతి, ఒంగోలు, విజయవాడ, కడప, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ ప్రాంతాల ప్రజల బయటకు వెళ్లకూడదని, అత్యవసర పరిస్థితుల్లో అయితే తప్పా అని అధికారులు చెబుతున్నారు. వర్షాలు కురిసే సమయంలో ప్రజలు ఇళ్లలోనే ఉండడం మంచిది. వరద నీటిలో ప్రయాణించకుండా జాగ్రత్తగా ఉండాలి. అలాగే విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
MODERATE - HEAVY RAINS from Vikarabad, Rangareddy, Sangareddy to cover Narayanpet, Mahabubnagar, Nagarkurnool next 1-2hrs
— Telangana Weatherman (@balaji25_t) September 2, 2025
LIGHT - MODERATE RAINS ahead in Medak, Yadadri - Bhongir Nalgonda Wanaparthy districts next 2hrs
Hyderabad - STEADY LIGHT RAINS to continue for next 1-2hrs…