BIG BREAKING: జూబ్లీహిల్స్‌పై AI సంచలన సర్వే.. గెలిచేది ఎవరో తెలుసా?

జూబ్లీహిల్స్ బై ఎలక్షన్‌లో మొదటిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వాడి సర్వే చేసింది గామా AI సంస్థ. డివిజన్ల వారిగా ఎక్కడ ఎవరి బలం ఎంత ఉందో స్పష్టంగా అంచనా వేసింది ఈ సర్వే సంస్థ. 10రోజులు 92 ప్రాంతాల్లో 6,532 మంది అభిప్రాయాలు AI టెక్నాలజీతో సేకరించారు.

New Update
AI survey

Jubliee Hills By Election: తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఆసక్తికరంగా మారింది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీకి ఇది బలపరీక్షలా ఉంది ఈ బై ఎలక్షన్. ఎవరు గెలుస్తారనే అంచనా వేయడం చాలా కష్టంగా మారింది. దీంతో ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని చెప్పడానికి మొదటిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) టెక్నాలజీ వాడి సర్వే చేసింది గామా AI సంస్థ. డివిజన్ల వారిగా ఎక్కడ ఎవరి బలం ఎంత ఉందో అని స్పష్టంగా అంచనా వేసింది గామా ఏఐ సర్వే సంస్థ. మొత్తం 10 రోజులు 92 ప్రాంతాల్లో 6,532 మంది అభిప్రాయాలు ఏఐ టెక్నాలజీ వాడి సేకరించారు. ఓటు ఎవరికి వేస్తారనే కాదు.. ఎందుకు వేస్తున్నారనే కోణాల్లోనే ఓటర్ల నుంచి అభిప్రాయాలను గామా ఏఐ సర్వేలో తెలుసుకున్నారు. 

ఓటర్లు ఇచ్చిన డేటాను ఖచ్చితంగా అనలైజ్ చేసి.. అభ్యర్థుల బలాలు, బలహీనతలు, ఓటర్లపై ప్రభావం వంటి అంశాలపై సర్వే చేసింది ఈ సంస్థ. ఓటింగ్ శాతంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉందని ఈ సర్వేలో తేలింది.  గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో 50శాతం కంటే తక్కువగా పోలింగ్ నమోదైంది. ఈసారి కూడా అంతే పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉందని సర్వే చేసిన టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ వైపే జూబ్లీహిల్స్ ప్రజలు చూస్తున్నారని AI సర్వేలో తేలింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉందని చెబుతున్నారు. పోలింగ్ శాతం పెరిగితే అధికార కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్‌గా మారుతుందని సర్వే చేసిన నిపుణులు చెబుతున్నారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్‌లో పోలింగ్ శాతం 50 దాటితే BRSకు కలిసొచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉందని అంచనాలు చెబుతున్నాయి. పోలింగ్ నవంబర్ 11న ఓటర్లు ఎక్కువమంది ఓటు హక్కు వినియోగించుకుంటే వారంతా బీఆర్ఎస్ పార్టీవైపే ఉండే అవకాశాలు ఉన్నాయని ఏఐ సర్వేలో ఉంది. 

గెలుపు ఎవరిదంటే..

jubliee hills by election
jubliee hills by election

కాంగ్రెస్ 48.50శాతం

బీఆర్ఎస్ 45.27 శాతం

బీజేపీ 6.23శాతం

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఏడు షేక్‌పేట్, యూసఫ్‌గూడా, సోమాజిగూడ, వెంగళ్‌రావు నగర్, ఎర్రగడ్డ, రెహమత్‌నగర్, బోరబండ డివిజన్లు ఉన్నాయి. ఏ డివిజన్‌లోనూ బీజేపీ ప్రభావం కనిపించడం లేదు. మైనార్టీ ఓటర్లు ఎక్కువగా అధికార కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారని సర్వేలో తేలింది. బస్తీల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి బలం కనిపిస్తున్నది.

షేక్‌పేట్

jubliee hills by election
jubliee hills by election

షేక్‌పేట్ డివిజన్‌లో స్పష్టంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కనిపిస్తోంది. దాదాపు 10శాతం ఓటర్ల నవీన్ యాదవ్‌వైపే మొగ్గుచూపుతున్నారు.

యూసఫ్‌గూడా

jubliee hills by election
jubliee hills by election

యూసఫ్‌గూడాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటాపోటీగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇల్లు కూడా ఇక్కడే ఉంది. యూసఫ్‌గూడా స్థానికుడైనా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆయనకు గట్టిపోటీ ఇస్తోంది.  

సోమాజిగూడ

Jubliee Hills By Election
Jubliee Hills By Election

సోమాజిగూడలో కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల ఓటు షేరింగ్ మధ్య కేవలం ఒక శాతం మాత్రమే ఉంది. బీజేపీ ఈ డివిజన్‌లో మాత్రమే 10శాతం ఓటింగ్ నమోదైంది. మిగిలిన ఆరు డివిజన్‌లో బీజేపీ 10శాతం కంటే తక్కువ ఓటింగ్ సొంతం చేసుకుంది. 

వెంగళ్‌రావు నగర్

jubliee hills by election
jubliee hills by election

వెంగళ్‌రావునగర్‌లో ఎక్కువగా ఏపీ సెట్టిలర్స్ ఉన్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కాబట్టి కారు గుర్తువైపై ఈ డివిజన్ ఓటర్లు చూస్తున్నారు.

ఎర్రగడ్డ

jubliee hills by election
jubliee hills by election

ఎర్రగడ్డ డివిజన్‌లో క్లియర్‌గా కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం ఉంది. ప్రజా సమస్యలు పరిష్కరించే వారికి ఎర్రగడ్డ ప్రజలు పట్టంకట్టాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ఇక్కడ నవీన్ యాదవ్‌ని చాలామంది కోరుకుంటున్నారు. ఎర్రగడ్డలో స్లమ్ ఏరియా ఎక్కువగా ఉంటుంది. 

రెహమత్‌నగర్

jubliee hills by election
jubliee hills by election

బోరబండ

Jubliee Hills By Election
Jubliee Hills By Election

బోరబండలో మైనార్టీ ఓటు బ్యాంకు కలిసివస్తోంది అధికార కాంగ్రెస్ పార్టీకి. అలాగే బీఆర్ఎస్‌ క్యాడర్ బలంగా ఉంది. గతంలో బీఆర్ఎస్ గతంలో చేసిన అభివృద్ధి పనులు ఓటర్లు గుర్తుంచుకున్నారు. అలాగే బోరబండలో ప్రజా సమస్యల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు