Ponguleti: దమ్ముంటే ప్రజల్లోకి రా.. కేసీఆర్‌కు మంత్రి పొంగులేటి సవాల్!

ప్రజ‌లు అత్యాశ‌కు పోయి కాంగ్రెస్‌కు ఓటేశారంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ప్రజా తీర్పును అగౌరవ పరిచి, ప్రజ‌ల‌ను అవ‌మానించారన్నారు. పిట్టలదొరలా మాట్లాడుతున్న కేసీఆర్ దమ్ముంటే ఫామ్ హౌస్ నుంచి బయటకు రావాలన్నారు.

New Update
Ponguleti Srinivas Reddy

Minister Ponguleti Srinivas Reddy

Ponguleti: ప్రజ‌లు అత్యాశ‌కు పోయి కాంగ్రెస్‌కు ఓటేశారంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ గర్జనలు, గంభీరాలు గమనిస్తున్నామన్నారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లోనే ఉండి మాట్లాడతారా లేదా అసెంబ్లీకి వస్తారా? అని ప్రశ్నించారు. 13 నెలల పాటు ఫామ్ హౌజ్‌కే పరిమితమై ఇంతకాలం మౌనంగా ఉన్నానని ఇప్పుడేదో అంటే సరిపోదన్నారు. ప్రతిపక్ష నాయకుడంటే ప్రజల్లో తిరగాలి. ప్రజా సమస్యలు ప్రస్తావించాలి. వ‌ర్షాలు వ‌చ్చినా.. వ‌ర‌ద‌లు వ‌చ్చినా క‌నీసం ప్రజ‌ల‌ను ప‌రామ‌ర్శించ‌లేదు. ఫామ్ హౌస్ దాట‌లేదంటూ విమర్శించారు.

జీవితమంతా ఫామ్ హౌసే..

అధికారంలో ఉన్ననాడు స‌చివాల‌యానికి రాలేదు. ప్రతిప‌క్ష నేత‌గా ఏడాది నుంచి అసెంబ్లీకి రాలేదు. ప్రజ‌ల్లోకి రాలేదు. కేసీఆర్ జీవితమంతా ఫామ్ హౌసే. ప్రజ‌లు అత్యాశ‌కు పోయి కాంగ్రెస్ కు ఓటేశారని కేసీఆర్ వ్యాఖ్యలు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజ‌ల‌ను అవ‌మానించేలా ఉన్నాయి. ప్రజా తీర్పును అగౌరవ పరుస్తున్నారు. ప్రజ‌ల‌న్నా.. ప్రజాతీర్పు అన్నా కేసీఆర్ కు ఏనాడూ గౌర‌వం లేదు. ప‌దేండ్లు అధికారం ఇచ్చిన ప్రజ‌ల‌కు ఓడిపోయిన త‌ర్వాత ఈ రోజు వ‌ర‌కు కూడా కనీసం కృత‌జ్ఞత తెల‌ప‌లేదు. ప్రజాతీర్పును శిర‌సావ‌హిస్తున్నామ‌ని కూడా ప్రక‌టించ‌లేదని పొంగులేటి అన్నారు.

పిట్టల దొర మాదిరి మాట్లాడుతున్నారు..

ఈ ఏడాది కాలంలో న‌ల్గొండ, క‌రీంన‌గ‌ర్ బీఆర్ఎస్ స‌భ‌ల్లో కూడా.. ఈరోజు మాదిరిగానే గంభీర ప్రక‌ట‌న‌లే చేశారు. ఆ త‌ర్వాత ఏమ‌య్యారో అందరికీ తెలిసిందే. ప్రతిప‌క్షనేత‌గా అసెంబ్లీ ముఖం చూడ‌ని వ్యక్తి త‌న ఉనికిని చాటుకోవ‌డానికి, నేనున్నాన‌ని చెప్పుకోవ‌డానికి తుపాకీ రాముడిలా, పిట్టల దొర మాదిరి మాట్లాడుతున్నారు. ప్రజలు ఏదో నమ్మి ఓటేశారని అంటున్నావు. వాస్తవాలు గ్రహించి నీ గడీల పాలన వద్దనుకుని ప్రజలు నిన్ను నీ కుటుంబాన్ని ఛీత్కరించారు. పథకాలు అమలు కాలేదని ఫామ్ హౌజ్ లో కూర్చొని మాట్లాడటం కాదు. ఇప్పటికైనా ప్రజల్లోకి రావాలనే మేమంటున్నాం అన్నారు.

ఇది కూడా చదవండి: CM Revanth: కేసీఆర్ ఓ రాఖీసావంత్.. ఇక జైలుకే.. తన స్టైల్లో మాస్ కౌంటర్ ఇచ్చిన రేవంత్!

అసెంబ్లీ సమావేశాలకు రావాలని ముఖ్యమంత్రి పదే పదే ఆహ్వానించారు. 80 వేల పుస్తకాలు చదివినారన్నారు. మీ అమూల్యమైన సూచనలు సలహాలు ఇవ్వాలని అసెంబ్లీకి రమ్మంటే ఎందుకు రాలేదు. 2020 రెవెన్యూ చట్టం దేశానికే ఆదర్శమని ప్రకటించిన మీరు భూ భారతి చట్టం ప్రవేశ పెట్టిననాడైన అస్సెంబ్లీకి వస్తారని ఆశించాం. నీ ఫామ్ హౌజ్ కు కరెంటు కోతలెక్కడివి. లెక్కలు తీద్దామా. ఏ రోజు ఎంత కరెంటు సరఫరా అయింది. ఎంత సరఫరా అవుతుంది. నీ ఫామ్ హౌజ్‌కు నీళ్లెక్కడివని మండిపడ్డారు.  

ఇది కూడా చదవండి: New Osmania hospital: 2వేల బెడ్లు, 30 డిపార్ట్‌మెంట్లు, 41 ఆపరేషన్ థియేటర్స్.. కొత్త ఉస్మానియా హాస్పిటల్ హైలెట్స్ ఇవే!

రైతు భరోసా ఇచ్చిందే మేము. రాష్ట్రంలో ఉచిత కరెంట్ తెచ్చిందే కాంగ్రెస్. చరిత్ర ప్రజలకు తెలియదా. నీవంటున్న గురుకులాలను సందర్శిద్దామా. మాతో వస్తారా. నీవెక్కడికంటే అక్కడికి రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అద్దె గదుల్లో పెట్టి విద్యార్థులను నానా ఇబ్బందులకు గురిచేసిన మీరా మాట్లాడేది. రైతుల రుణమాఫీ కోసం 20 వేల కోట్ల రూపాయలు ఇచ్చిన సంగతి కళ్లకు కనిపించడం లేదా. అభివృద్ధి మీద చర్చకు సిద్ధమా? ఏదైనా మాట్లాడితే దానికొక ప్రాతిపదిక ఉండాలి. ముస్లింలను కాంగ్రెస్ వాడుకుంది అంటున్నావు. వాడుకుని వదిలేసే చరిత్ర నీది అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు