UP crime : ఓరెయ్ కామాంధుడా... ప్రైవేట్ పార్ట్స్ తాకి పారిపోయాడు.. యోగి స్టైల్ ట్రీట్మెంట్ ఇచ్చారు!

ఇల్లీగల్ వెపన్ తో పారిపోతున్న ఆదిల్ పై పోలీసులు కాల్పులు జరిపారు. అనంతరం అతడిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. కోలుకున్న అనంతరం అతడి చేత బాధితురాలికి  క్షమాపణలు చెప్పించారు.

New Update
up crime

ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో పట్టపగలు బుర్ఖా ధరించి నడిరోడ్డుపై వెళ్తున్న మహిళపై లైంగిక దాడికి పాల్పడిన ఓ నిందితుడికి పోలీసులు యోగి స్టైల్ ట్రీట్ మెంట్ అందించారు. నడిరోడ్డుపై వెళ్తున్న మహిళను అదిల్ వెనుక నుంచి గట్టిగా పట్టుకుని ప్రైవేట్ పార్ట్స్ తాకి పారిపోయాడు. బాధితురాలు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టగా అదే రోజు అతన్ని పట్టుకున్నారు. 

ఇల్లీగల్ వెపన్ తో పారిపోతున్న ఆదిల్ పై పోలీసులు కాల్పులు జరిపారు. అనంతరం అతడిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. కోలుకున్న అనంతరం అతడి చేత బాధితురాలికి  క్షమాపణలు చెప్పించారు. ఈ సంఘటన మొరాదాబాద్‌లోని నాగ్‌ఫాని పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని డిప్యూటీగంజ్ ప్రాంతంలో జరిగింది. ఆగస్టు 3న బాధితురాలు మార్కెట్ నుండి వస్తువులు కొనుగోలు చేసి ఇంటికి తిరిగి వస్తుండగా ఆమెను వెనుక నుండి బలవంతంగా పట్టుకుని అదిల్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. 

ప్రతిఘటించడంతో పారిపోయాడు

బాధితురాలు ప్రతిఘటించడంతో అక్కడి నుండి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం సిసిటివి టీవీలో రికార్డైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. కేవలం 24 గంటల్లోనే పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి ఒక మోటార్ సైకిల్, అక్రమ పిస్టల్, లైవ్ కార్ట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ఆదిల్ పై తీవ్రమైన సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. లైంగిక వేధింపులు, మహిళ గౌరవాన్ని అవమానించడం, అక్రమ ఆయుధాలు కలిగి ఉండటం వంటి సెక్షన్ల కింద అతనిపై చర్యలు తీసుకుంటామని   ఎస్పీ సిటీ కుమార్ రణ్‌విజయ్ సింగ్  వెల్లడించారు.  

ఈ ఏడాది మే నెలలో యూపీలోని మీరట్‌లో ఇలాంటి సంఘటనే జరిగింది, పట్టపగలు బుర్ఖా ధరించిన మహిళను ఒక వ్యక్తి బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ మహిళ ఇరుకైన సందు నుండి నడుచుకుంటూ వెళుతుండగా, బైక్‌పై వచ్చిన వ్యక్తి ఆమెను బలవంతంగా బహిరంగంగా ముద్దు పెట్టుకున్నాడు. వీడియో బయటకు వచ్చిన తర్వాత పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. నిందితుడిని సుహైల్‌గా గుర్తించారు. తన చర్యలకు క్షమాపణలు కోరాడు.

Advertisment
తాజా కథనాలు