BIG BREAKING : కులగణనపై కేంద్ర కీలక నిర్ణయం
కులగణనపై కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. 2027, మార్చి 1వ తేదీ నుంచి ఈ కులగణన చేపట్టాలని నిర్ణయించింది. అయితే రెండు దశలుగా కులగణన చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. దీనితోపాటు జనగణనను సైతం చేపట్టాలని చూస్తోంది
కులగణనపై కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. 2027, మార్చి 1వ తేదీ నుంచి ఈ కులగణన చేపట్టాలని నిర్ణయించింది. అయితే రెండు దశలుగా కులగణన చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. దీనితోపాటు జనగణనను సైతం చేపట్టాలని చూస్తోంది
న్యూ ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ నుంచి మరో అధికారిని భారత ప్రభుత్వం బహిష్కరించింది. 24 గంటల్లోపు దేశం విడిచి వెళ్ళిపోవాలని చెప్పింది. తన హోదాకు తగ్గట్టుగా నడుచుకోకపోవడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తొలి ట్రాన్స్‌జెండర్ కౌన్సిలర్ బాబీ కిన్నార్ ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం ఇంద్రప్రస్థ వికాస్ పార్టీలో చేరారు. ఆమె ప్రస్తుతం సుల్తాన్పూర్ మజ్రా అసెంబ్లీ నియోజకవర్గంలోని 43వ వార్డు నుండి కౌన్సిలర్ గా ఉన్నారు.
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా చారిత్రక కట్టడాల వద్ద భద్రతను పెంచారు. ఎర్రకోట, కుతుబ్‌మినార్ దగ్గర బలగాలను పెంచడంతో పాటు హైదరాబాద్‌లో కూడా సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు.
తాను మొఘలుల వారసుడి భార్యనని, ఎర్రకోట తనకు ఇప్పించాలని కోరుతూ సుల్తానా బేగమ్ అనే మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మొఘల్ పాలకుడు బహదూర్ షా జాఫర్ కు తన దివంగత భర్త మహ్మద్ బీదర్ బఖ్త వారసుడని ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు. ఆ పిటిషన్ ను సుప్రీం కొట్టేసింది.
ఢిల్లీకి కాబోయే కొత్త సీఎంగా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తా ఎన్నికయ్యారు. ఆమె ఆస్తులెంత,ఆప్పులెంత అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం మొత్తం ఆస్తుల విలువ రూ.5.3 కోట్లు కాగా అప్పులు రూ. 1.2 కోట్లు.
ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చాలామంది తమ ఆప్తులను కోల్పోయారు. మరికొందరు కనిపించకుండా పోయారు. సొంతకుటుంబ సభ్యులు కనిపించకుండా పోవడంతో వారి బాధలు వర్ణాణతీతం అనే చెప్పాలి.
న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట 18 మంది ప్రాణాలు బలిగొంది. ఇందులో 11 మంది మహిళలు, చిన్నారులే ఉన్నారు. ప్రయాగ్ రాజ్ వెళ్ళాల్సిన రైళ్లు రద్దయ్యాయనే పుకారు చెలరేగడమే తొక్కిసలాటకు కారణం అని అంటున్నారు.
ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు భారత రైల్వే శాఖ రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షల పరిహారం, స్వల్పంగా గాయపడిన వారికి రూ.1 లక్ష పరిహారం కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది