CM Revanth Reddy : మేడిగడ్డ కూలింది. ఎల్లంపల్లే మనకు దిక్కు..సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

గత ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, తెలంగాణకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గుండెకాయ అని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ విషయంలో సాంకేతిక కమిటీ సూచన ప్రకారం ముందుకు వెళ్తామని తేల్చి చెప్పారు.  

New Update

CM Revanth Reddy

CM Revanth Reddy: గత ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, తెలంగాణకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గుండెకాయ అని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ విషయంలో సాంకేతిక కమిటీ సూచన ప్రకారం ముందుకు వెళ్తామని తేల్చి చెప్పారు.  కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో చర్చిస్తామని పేర్కొన్నారు.  మేడిగడ్డ, సుందిళ్ల అన్నారం బ్యారేజీలను ఒకే రకంగా కట్టారని ఈ మూడు బ్యారేజీల్లో నీటి నిల్వ, ఏత్తిపోతల క్షేమం కాదని ఎన్డీఎస్ఏ చెప్పిందని వివరించారు. నీరు నిల్వ చేస్తే  మొత్తం కూలిపోయి గ్రామాలు కొట్టుకుపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మేడిగడ్డ పనికిరాకుండా పోయిందని విమర్శించారు. మామ, అల్లుడు ఎన్ని కుట్రలు చేసినా వారు చేసిన పాపాలు పోవని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు.

Also Read: కామారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో పరిస్థితి ఘోరం VIDEO.. ఈరోజు మరో 2 జిల్లాల్లో డేంజర్‌

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా పడుతున్న వానలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో వరదలు అల్లకల్లోలం  సృష్టిస్తున్నాయి. అకస్మాత్తుగా వచ్చిన వరదలతో పలువురు చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి ఏరియల్‌ సర్వే నిర్వహించారు. సీఎం తో పాటు ఇతర మంత్రుల బృందం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరి పెద్దపల్లి జిల్లాకు చేరుకున్నారు. ఏరియల్ వ్యూ ద్వారా గోదావరి, ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ను పరిశీలించారు. సీఎం రేవంత్‌రెడ్డి వెంట మంత్రులు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ సీఎస్‌, డీజీపీ జితేంద్ర, తదితరులు ఉన్నారు.

Also Read :  తెలంగాణలో కుండపోత వర్షాలు.. 25 జిల్లాలకు బిగ్ అలర్ట్.. డేంజర్ జోన్‌లో ఈ 11 జిల్లాలు!

 అనంతరం ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం, పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టే మనకు ప్రాణవాయువు అని తేల్చి చెప్పారు. నిపుణులు కట్టిన ప్రాజెక్టు కాబట్టే దశాబ్దాలుగా ఎల్లంపల్లి నిలబడిందన్నారు. వ్యూహాత్మక ప్రాంతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మించారని తెలిపారు. కూలిపోయిన ప్రాజెక్టు, నిలబడిన ప్రాజెక్టుకు మధ్య తేడా ఇదే నన్నారు. గోదావరి జలాల విషయంలో మనకు ఎల్లంపల్లి చాలా కీలకం కానుందని  చెప్పారు. ఈ సందర్భంగా వరద నియంత్రణపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. అనంతరం కామారెడ్డి జిల్లా పర్యటనకు రేవంత్‌ బయలు దేరారు. అయితే కామారెడ్డిలో హెలికాప్టర్‌ దిగడానికి వాతావరణం అనుకూలించకపోవడంతో మెదక్‌ చేరుకుని అక్కడ రివ్యూ మీటింగ్‌ నిర్వహించారు.

Also Read: Mutual Funds: మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెద్ద మొత్తంలో లాభాలు రావాలంటే.. ఎన్ని యూనిట్లు ఎప్పుడు అమ్మాలంటే?

Advertisment
తాజా కథనాలు