మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన ఓ కార్యకర్తతో మాట్లాడిన ఆడియో వైరల్ అవుతోంది. ఆ ఫోన్‌కాల్‌లో బాలరాజు తాను బీజేపీలోకి వెళ్తున్నట్లు చెప్పారు. బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేయాలని చూస్తున్నారని.. అందుకే ముందుగానే బీజేపీలోకి వెళ్తే బాగుంటుందని ఆ కార్యకర్తతో చెప్పారు. అలాగే పార్లమెంటు ఎన్నికల్లో మనకు కాకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు అవకాశం ఇచ్చారని అన్నారు. ఇప్పుడు ప్రవీణ్ కుమార్‌కు పార్టీలో మరింత ప్రాధాన్యం ఇస్తున్న హరీష్ రావు అన్నట్లు.. ప్రవీణ్ కుమార్ అనుచరులు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. దీంతో ఈ ఆడియో సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. గతంలో కూడా బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తారనే ప్రచారం జరిగింది.
Breaking News...
— మీ కాపలా కుక్క (@mekaapalaKukka) August 4, 2025
Guvvala Balraj ఆడియో వైరల్ ..pic.twitter.com/UUggEvNy7i
Also Read: కేసీఆర్‌పై చర్యలు ?.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన
ఎమ్మెల్సీ కవిత కూడా ఓసారి దీనిపై స్పందించారు. తాను జైల్లో ఉన్నప్పుడు విలీనం ప్రతిపాదన తీసుకొచ్చారని.. కానీ తాను వద్దని చెప్పినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత కేటీఆర్, హరీష్‌రావు అలాంటి ఆలోచనే తమకు లేదని స్పష్టం చేశారు. కానీ మరోసారి తాజాగా గువ్వల బాలరాజు ఆడియోలో విలీనం ప్రస్తావణ రావడం కలకలం రేపుతోంది. గువ్వల బాలరాజు నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆయన ఆ జిల్లాకు బీఆర్ఎస్‌కు అధ్యక్షుడిగా ఉన్నారు.
Also read: కేసీఆర్ ఇష్టమొచ్చినట్లు డిజైన్లు మార్చేశారు.. మంత్రి ఉత్తమ్ సంచలన ఆరోపణలు
ఇదిలాఉండగా మొత్తానికి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే గువ్వల బాలరాజు రాజీనామా చేయగా ఆయన బాటలోనే మర్రి జనార్థన్ వెళ్లనున్నారు. ఈయన కూడా బీజేపీలోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అలాగే జైపాల్ యాదవ్, అబ్రహం, బీరం హర్షవర్ధన్ రెడ్డి కూడా బీఆర్‌ఎస్‌ను వీడనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా అయిదుగురు బీఆర్‌ఎస్ నేతలు బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం నడుస్తోంది.
Also Read: అతి త్వరలో అరెస్ట్ కాబోతున్నా.. కేసీఆర్ సంచలన ప్రకటన!