Telangana: కేసీఆర్ ఇష్టమొచ్చినట్లు డిజైన్లు మార్చేశారు.. మంత్రి ఉత్తమ్ సంచలన ఆరోపణలు
తెలంగాణలో కేబినెట్ సమావేశం ముగిసింది. ఘోష్ కమిషన్ రిపోర్ట్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు తాజాగా మీడియాకు వెల్లడించారు.
తెలంగాణలో కేబినెట్ సమావేశం ముగిసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్‌ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు తాజాగా మీడియాకు వెల్లడించారు. '' ఆ కమిటీ 25 పేజీలకు కుదించి క్లిప్తంగా అందించింది. తుమ్మడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టాలని గతంలో నిర్ణయించారు. రూ.38 వేల కోట్లతో 16 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చేలా డిజైన్ చేశారు. కానీ కేసీఆర్ వచ్చాక ఇష్టమొచ్చిన రీతిలో డిజెన్లు మార్చేశారు. అధిక వడ్డీలకు NBFCల దగ్గర లోన్లు తీసుకొచ్చారు. ఏకంగా రూ.84 వేల కోట్ల రుణాలు తీసుకొచ్చారు. అయితే ఈ రుణాలు తీసుకొచ్చే విషయంలోనే అవకతవకలకు పాల్పడ్డారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాళేశ్వరంపై విచారణకు ఆదేశించాం. రాజకీయ అంశాలతో సంబంధం పీసీ ఘోష్ కమీషన్ వేశాం. 605 పేజీలతో కూడిన రిపోర్డును కమిషన్ ప్రభుత్వానికి అందించింది. కమిటీ నివేదిక అధ్యయనానికి ముగ్గురు అధికారులతో కమిటీ వేశాం. ఆ కమిటీ 25 పేజీలను నివేదికను కుదించింది. మేడిగడ్డ బ్యారేజీలో చాలా లోపాలున్నట్లు NDSA కూడా చెప్పింది. డిజైన్, నిర్మాణం, నిర్వహణలో లోపాలు ఉన్నట్లు స్పష్టం చేసింది. మేం అధికారంలోకి రాకముందే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పునాదుల్లోనే సమస్యలున్నాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్లు పీసీ ఘోష్ రిపోర్టు స్పష్టం చేసింది. కమిషన్ నివేదికను కేబినెట్‌లో చర్చించాం. విచారణలో భాగంగా కేబినెట్ తీర్మానాలను కమిషన్‌కు ఇచ్చాం. కాగ్ రిపోర్టు, NDSA నివేదికను కూడా ఘోష్ కమిషన్ పరిశీలించింది. తుమ్మడిహట్టి దగ్గర నీళ్లు లేకపోవడంతోనే ప్రాజెక్టును మేడిగడ్డను మార్చినట్లు గత ప్రభుత్వం చెప్పిన విషయం అబద్ధమని తెల్చిచెప్పింది. మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు నిర్మించాలని కేసీఆరే నిర్ణయించారు. పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికనే మేము వివరిస్తున్నాము.
అంతేకాదు 2016లో కేసీఆర్ వేసిన నిపుణుల కమిటీ కూడా మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణం వద్దని సూచలను చేసింది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టును కూడా గత సీఎం పట్టించుకోలేదు. ఉద్దేశపూర్వంగా కేసీఆర్, హరీష్ రావు కమిటీ రిపోర్టును పక్కనపెట్టారు. ఆనాటి ముఖ్యమంత్రి ప్రతీ చిన్న విషయంలో రాజకీయ జోక్యం చేసుకోవడంతోనే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూలినట్లు కమిషన్ తెలిపిందని'' మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.

Minister Uttam Kumar reddy

Also Read: దంచికొడుతున్న వాన.. ఆ ఏరియాల్లో స్తంభించిన ట్రాఫిక్.. చెరువులను తలపిస్తున్న రోడ్లు!
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాళేశ్వరంపై విచారణకు ఆదేశించాం. రాజకీయ అంశాలతో సంబంధం పీసీ ఘోష్ కమీషన్ వేశాం. 605 పేజీలతో కూడిన రిపోర్డును కమిషన్ ప్రభుత్వానికి అందించింది. కమిటీ నివేదిక అధ్యయనానికి ముగ్గురు అధికారులతో కమిటీ వేశాం. ఆ కమిటీ 25 పేజీలను నివేదికను కుదించింది. మేడిగడ్డ బ్యారేజీలో చాలా లోపాలున్నట్లు NDSA కూడా చెప్పింది. డిజైన్, నిర్మాణం, నిర్వహణలో లోపాలు ఉన్నట్లు స్పష్టం చేసింది. మేం అధికారంలోకి రాకముందే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది.
Also read: సీఎం రేవంత్ ఫోన్ కాల్ లీక్ చేసిన కోమటిరెడ్డి.. వైరల్ గా మారిన సంభాషణ!
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పునాదుల్లోనే సమస్యలున్నాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్లు పీసీ ఘోష్ రిపోర్టు స్పష్టం చేసింది. కమిషన్ నివేదికను కేబినెట్‌లో చర్చించాం. విచారణలో భాగంగా కేబినెట్ తీర్మానాలను కమిషన్‌కు ఇచ్చాం. కాగ్ రిపోర్టు, NDSA నివేదికను కూడా ఘోష్ కమిషన్ పరిశీలించింది. తుమ్మడిహట్టి దగ్గర నీళ్లు లేకపోవడంతోనే ప్రాజెక్టును మేడిగడ్డను మార్చినట్లు గత ప్రభుత్వం చెప్పిన విషయం అబద్ధమని తెల్చిచెప్పింది. మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు నిర్మించాలని కేసీఆరే నిర్ణయించారు. పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికనే మేము వివరిస్తున్నాము.
Also read: అమెరికా పెట్టుబడుల వీసాలకు డిమాండ్.. ఆసక్తి చూపుతున్న భారతీయులు
అంతేకాదు 2016లో కేసీఆర్ వేసిన నిపుణుల కమిటీ కూడా మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణం వద్దని సూచలను చేసింది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టును కూడా గత సీఎం పట్టించుకోలేదు. ఉద్దేశపూర్వంగా కేసీఆర్, హరీష్ రావు కమిటీ రిపోర్టును పక్కనపెట్టారు. ఆనాటి ముఖ్యమంత్రి ప్రతీ చిన్న విషయంలో రాజకీయ జోక్యం చేసుకోవడంతోనే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూలినట్లు కమిషన్ తెలిపిందని'' మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.
Also Read: ఐటీ ఉద్యోగి దీనపరిస్థితి.. ఆఫీస్ ముందే మూడు రోజులు! వైరలవుతున్న లెటర్