/rtv/media/media_files/2025/07/24/happy-birthday-to-ktr-2025-07-24-10-50-11.jpg)
Happy birthday to KTR : Kavita
Kavitha Kalvakuntla : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గులాబీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.పలువురు కేటీఆర్ పేరుతో కేకులు కట్ చేసి శుభాకాంక్షలు చెబుతున్నారు. మరోవైపు అనాథ అశ్రమాలు, వృద్ధ అశ్రమాలల్లో పలువురు అన్నదానం చేస్తున్నారు. మరికొందరు ఆసుపత్రల్లో పళ్లు పంపిణీ చేస్తున్నారు.బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేటీఆర్ ఇంటికి స్వయంగా వెళ్లి బర్త్ డే విషెస్ చెబుతున్నారు.
Also Read: అసలెక్కడా లేని దేశం...దానికో రాయబార కార్యాలయం..ఘజియాబాద్ లో హైటెక్ మోసం
సోషల్ మీడియాలోనూ కేసీఆర్‌కు శుభాకాంక్షుల వెల్లువెత్తాయి. అలాగే కేటీఆర్ సోదరి, ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా తన సోదరడు కల్వకుంట్ల తారకరామరావుకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. ‘అన్నయ్య.. మెనీ మోర్ హ్యాపీ రిటర్స్న్ ఆఫ్ ది డే’ అంటూ సింపుల్ గా కవిత విషెస్ చెప్పారు.దీంతో వారి అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు.కవిత గారు కూడా గొడవలు అన్ని పక్కన పెట్టి అన్నకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు... అని ఒకరు. నీది మంచి మనసు అక్క నీ పతనం కోరుకునేవాడి బాగు కోరుకుంటున్నావ్ అంటూ మరికొందరు పోస్ట్ చేస్తున్నారు.
Also Read: రష్యా మహిళను బహిష్కరించొద్దు : కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు
కాగా, ఇటీవల కవిత, కేటీఆర్‌కు మధ్య విబేధాలు చోటు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఎమ్మెల్సీ కవిత, కేసీఆర్‌కు రాసిన లేఖ బయటకు రావడంతో బీఆర్ఎస్ పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. కేసీఆర్ దేవుడని.. చుట్టూ దయ్యాలు ఉన్నాయని, పార్టీలో కొవర్టులదే రాజ్యమంటూ కవిత కామెంట్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ వ్యాఖ్యలు ‘కేటీఆర్ అండ్ కో’ని ఉద్దేశించి చేశారని వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టాయి. ఈ పరిణామంతో అప్పటి నుంచి కవిత, కేటీఆర్ మధ్య గ్యాప్ వచ్చింది. ఈ క్రమంలో సోషల్ మీడియా శుభాకాంక్షలతోనే ఊరుకుంటారా? లేక ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు చెబుతారా అనేది సస్పెన్స్‌గా మారింది.
Also Read: Bangladesh: ఎయిర్ క్రాష్ బాధితుల కోసం ముందుకు వచ్చిన భారత్..ఢాకాకు స్పెషల్ టీమ్