Bangladesh: ఎయిర్ క్రాష్ బాధితుల కోసం ముందుకు వచ్చిన భారత్..ఢాకాకు స్పెషల్ టీమ్

బంగ్లాదేశ్ కు సహాయం చేసేందుకు భారతదేశం ముందుకు వచ్చింది. ఎయిర్ క్రాష్ బాధితుల కోసం కాలిన గాయాల నిపుణులైన వైద్యులు, నర్సుల బృందాన్ని పంపించనుంది. దీని తర్వాత అత్యవసరమైతే బాధితులను ఇండియాకు తీసుకురానున్నారు.

New Update
dhaka

Dhaka Air Crash

ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ మాదిరే ఢాకాలో కూడా ఓ కాలేజీ బిల్డింగ్‌పై ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ జెట్ కూలిపోయింది. దీంతో బంగ్లాదేశ్‌లో మంగళవారం రాష్ట్ర సంతాప దినం ప్రకటించారు. కాలేజీలో క్లాస్‌లు జరుగుతుండగా చైనాకు చెందిన ఎఫ్-7 శిక్షణ జెట్ విమానం కూలిపోయింది. 19 మంది మరణించగా, 70 మంది గాయపడ్డారు. ఢాకా అంతటా 70 మందికి పైగా గాయపడి ఆరు ఆసుపత్రులలో చేరారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విమానం పేలుడు మంటలను ఆర్పారు. చైనాలో తయారైన ఎఫ్-7 జెట్ విమానం ఢాకాలోని ఉత్తర ప్రాంతంలోని మైల్‌స్టోన్ స్కూల్ అండ్ కాలేజీ భవనంపైకి దూసుకెళ్లింది. తరగతులు జరుగుతున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. 

ఇండియా నుంచి వైద్య బృందం..

ఈ ప్రమాదంలో గాయపడ్డ బాధితుల కోసం ఇప్పుడు భారత్ సహాయక చర్యలను చేపట్టింది. ఢాకాలో జరిగిన విషాదకరమైన విమాన ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ కు సహాయం అందిస్తామని తెలిపారు. ఇందులో భాగంగా కాలిన గాయాల నిపుణులైన డాక్టర్లు, నర్సుల బృందాన్ని డాకాకు పంపిస్తున్నామని విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. వీరు బాధితులకు చికిత్స చేస్తారు. దాంతో పాటూ తదుపరి చికిత్స, ప్రత్యేక సంరక్షణ కోసం రోగుల పరిస్థితిని అంచనా వేస్తారు. అవసరమైతే బాధితులను ఇండియా కూడా తరలిస్తారని విదేశాంగ శాఖ వివరించింది. అలాగే ఈ విషాద సంఘటనలో గాయపడిన వారికి భారతదేశంలో ఏర్పాటు చేయాల్సిన ఏవైనా క్లిష్టమైన వైద్య సహాయం గురించి సమాచారాన్ని పంచుకోవాలని కోరుతూ భారత హైకమిషన్ ఈరోజు అధికారికంగా బంగ్లాదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇదిలా ఉండగా, ఈ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 27కి పెరిగింది. 

Also Read: Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ పై చర్చకు కేంద్రం సిద్ధం

Advertisment
తాజా కథనాలు