కిషన్ రెడ్డి పద్ధతి మార్చుకో.. KTR అహంకారం తగ్గించుకో.. సీఎం రేవంత్ వార్నింగ్!

ఈ గెలుపు తమ మీద బాధ్యతను మరింతగా పెంచిందన్నారు. హైదరాబాద్ లో సాధారణ ఎన్నికల్లో తమకు పెద్దగా ఫలితాలు రాలేదన్నారు. కానీ రెండేళ్ల తర్వాత ప్రజలు తమను దీవించారన్నారు. బాధ్యతతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని ఓట్ల ద్వారా తమకు తెలిపారన్నారు.

New Update
Revanth Reddy

కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక్క తాటిపై ఉన్నప్పుడు ఎవరి తాత కూడా తమను ఓడించలేదని జూబ్లీహిల్స్ ఫలితాలతో మరోసారి స్పష్టమైందని సీఎం రేవంత్ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ గెలుపు తమ మీద బాధ్యతను మరింతగా పెంచిందన్నారు. హైదరాబాద్ లో సాధారణ ఎన్నికల్లో తమకు పెద్దగా ఫలితాలు రాలేదన్నారు. కానీ రెండేళ్ల తర్వాత ప్రజలు ఈ ఎన్నిక ద్వారా తమను దీవించారన్నారు. బాధ్యతతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని ఓట్ల ద్వారా తమకు తెలిపారన్నారు. పోలైన ఓట్లలో 51 శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయన్నారు. 38 శాతం ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, 8 శాతం బీజేపీకి వచ్చాయన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు విలక్షణ తీర్పు ఇచ్చారు.. పోలైన ఓట్లట్లో 51 శాతం ఓట్లు కాంగ్రెస్ కు, 38 శాతం బీఆరెస్ కు , 8 శాతం బీజేపీ ఓటు వేశారు తెలంగాణ బడ్జెట్ లో 60-65 శాతం ఆదాయం ఇక్కడి నుంచి వస్తుందన్నారు. ఈ నగరాన్ని కాపాడుకోవడం, అభివృద్ధి చేసుకోవడం, అవరసమైన ప్రణాళికలు చేయడాన్ని తమ ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును బాధ్యతగా తీసుకుని నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తామన్నారు.

చెరువులు, కుంటలు, నాలాల సమస్యల రహిత నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతామన్నారు. మూసీ ప్రక్షాళనకు కావాలని ప్రతిపక్షాలు అడ్డుతగిలాయని ఆరోపించారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు మంచి జీవితాన్ని కల్పించాలన్న తమ ప్రయత్నాన్ని అడ్డుకున్నారన్నారు. కేంద్రం నుంచి తీసుకుని రావాల్సిన నిధులు రాకుండా కిషన్ రెడ్డి సహాయ నిరాకరణ చేస్తున్నారన్నారు. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో 65 వేల ఓట్లు బీజేపీకి వస్తే ఇప్పుడు అందులో 25 శాతం ఓట్లు కూడా రాలేదన్నారు. డిపాజిట్ కూడా పోయిందన్నారు. కిషన్ రెడ్డి వ్యవహార శైలి మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికైనా హైదరాబాద్ అభివృద్ధికి సహకరించాలని కిషన్ రెడ్డిని కోరారు. 

హరీష్ రావు అసూయ, కేటీఆర్ అహంకారాన్ని తగ్గించుకోవాలని సూచించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, వారసత్వం కూడా కాదని గమనించాలన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసినా అంతకన్నా ఎక్కువ శాతం ఓట్లు ఇచ్చి ఆశీర్వదించారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు మద్దతు తెలపాలన్నారు. హరీష్ రావు అసూయ తగ్గించుకోవాలని సూచించారు. అసెంబ్లీలో ఆయన అధికార పక్షంపైపు అసూయగా చూసూ చూపును ప్రజలు గమనిస్తారన్నారు. కేటీఆర్ అహంకారాన్ని తగ్గించుకోవాలన్నారు. వీళ్లద్దరి నాయకత్వాన్ని ప్రజలు ఎలా ఆమోదిస్తారన్నారు. వాళ్లే తప్పుడు వార్తలు సృష్టించి.. వాటిని వారే నమ్మి.. ఆరోపణలు చేస్తారని ఎద్దేవా చేశారు.  

బూత్ స్థాయి నుంచి పీసీసీ చీఫ్ వరకు.. వార్డ్ నంబర్ నుంచి సీఎం వరకు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక్క తాటిపై ఉన్నప్పుడు ఎవరి తాత కూడా తమను ఓడించలేదని మరోసారి స్పష్టమైందన్నారు. ఈ ఎన్నికలో తమకు సహకరించిన ఎంఐఎం, సీపీఎం, సీపీఐ, కోదండరాం, అన్ని సంఘాలకు సీఎం రేవంత్ ధన్యవాదాలు తెలిపారు. 

Advertisment
తాజా కథనాలు