TG Crime : మేడ్చల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అనురాగ్ రెడ్డి హాస్టల్‌లో ఉంటూ క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్న మహేందర్‌రెడ్డిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. గతంలో ఇదే హాస్టల్లో మహేందర్‌రెడ్డి ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే మహేందర్ రెడ్డి స్నేహితుడే చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.
Also Read : విపరీతంగా పెరుగుతున్న చలి తీవ్రత..ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
వివాహేతర సంబంధంతో..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీర్జాదిగూడ మల్లికార్జున నగర్‌లో అనురాగ్‌రెడ్డి బాయ్స్ హాస్టల్ ఉన్నది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ కారణంగా హత్య చేశారు. ఈ హత్యకు గల కారణం.. హాస్టల్ ఓనర్ పద్మతో మహేందర్‌రెడ్డికి గొడవలు జరుగుతున్నాయి. మహేందర్‌రెడ్డి ఈ మధ్యనే హాస్టల్ నుంచి ఖాళీ చేసి వెళ్లిపోయాడు. హాస్టల్ ఓనర్ పద్మ శుక్రవారం ఉదయం మహేందర్‌రెడ్డిని హాస్టల్‌కి పిలిపించింది. అనంతరం శనివారం ఉదయం 3:30 గంటలకు మహేందర్‌రెడ్డి హాస్టల్‌కి వచ్చాడు. అదే హాస్టల్లో ఉంటున్న కిరణ్‌రెడ్డి అనే వ్యక్తితో మహేందర్‌రెడ్డిని దారుణంగా హత్య చేపించారు.
ఇది కూడా చదవండి: శేషాచలం అడవుల్లో విద్యార్థుల మిస్సింగ్..సెల్ ఫోన్ ఆధారంగా గాలింపు
రంగంలోకి దిగిన పోలీసులు..క్లూస్ టీం సహాయంతో హాస్టల్ ఓనర్ పద్మ, కిరణ్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సీఐ గోవిందరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. మల్కాజిగిరి ఏసీబీ చక్రపాణి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్య జరిగిన పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ హాస్టల్లో యువకులంతా మద్యం సేవించి ఎప్పుడు ఏదో ఒక గొడవ పడుతూనే ఉంటారని పోలీసుల సమాచారంలో తెలిసింది. దీంతో ఇక్కడ నుంచి హాస్టల్ తీసేయాలని స్థానికులు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలపై పోలీసులు లోతుగా ఆరాధిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఇన్‌స్టా ప్రేమ.. దాడిలో కార్లు ధ్వంసం
Also Read : ఢిల్లీలో దారుణం.. భార్యను హతమార్చి ఆ తర్వాత ఏం చేశాడంటే?
today news in telugu