AP Crime: అన్నమయ్య జిల్లాలో విద్యార్థులు కనపడకుండా పోవడం కలకలం రేపుతోంది. రైల్వే కోడూరు శేషాచలం అడవుల్లో విద్యార్థులు తప్పిపోయారు. శ్రీకాళహస్తికి చెందిన ఆరుగురు బీటెక్ విద్యార్థులు వాటర్ ఫాల్స్ చూడటానికి వెళ్లారు. ఈ క్రమంలోనే శేషాచలం అడవుల్లో దారితప్పి తప్పిపోయారు. తిరుగు ప్రయాణంలో విద్యార్థులు తప్పిపోయినట్లు తెలుస్తోంది. విద్యార్థుల మిస్సింగ్‌పై తోటి స్నేహితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.. విద్యార్థుల ఆచూకి కనిపెట్టారు. వారిని బయటకు తీసుకొస్తామని పోలీసులు తెలిపారు. దారి తప్పి అడవిలోనే చిక్కుకున్న.. పోలీసులు వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లా శేషాచలం అడవుల్లోకి వెళ్లిన విద్యార్థులు దారితప్పారు. గుంజనేరు వాటర్ ఫాల్స్ చూసేందుకు ఆరుగురు బీటెక్ విద్యార్థులు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారి కొందరూ దారితప్పి అడవిలో చిక్కుకున్నారు. విద్యార్థులు సమాచారం ఇవ్వగానే పోలీసులు, అటవీ శాఖ అధికారులు వెంటనే అలర్ట్ అయ్యారు. రైల్వేకోడూరు సమీపంలో ఉన్న శేషాచలం అడవుల్లో ఆరుగురు విద్యార్థులు శుక్రవారం సాయంత్రం వెళ్లారు. తప్పిపోయిన విద్యార్థులంతా శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ చదువుతున్నారు. వీరంతా దారి తప్పి అడవిలోనే చిక్కుకుపోయారు. సమాచారం తెలిసిన వెంటనే అటవీశాఖ సిబ్బంది, పోలీసులు.. ఫారెస్టులోకి ఎంటర్ అయ్యారు. విద్యార్థుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. గుంజనేరు వాటర్ ఫాల్స్‌కు సంబంధించిన కొంతమంది వ్యక్తులతో సమాచారం తీసుకోవాలని పోలీసులు తెలుపుతున్నారు. గుంజనేరు వాటర్ ఫాల్స్ పరిసర ప్రాంతాలతో పాటు అడవిలోకి వెళ్లే దారి, బయటకు వచ్చే దారి తెలిసిన కొంతమంది వ్యక్తులను ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థుల కోసం పోలీసులు, అటవీశాఖ సిబ్బందిని అడవిలోకి వెంటపెట్టుకుని వెళ్లారు. తప్పిపోయిన విద్యార్థుల ఆచూకీ తెలుసుకుని వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ఆరుగురు విద్యార్థుల్లో ఒకరు అనారోగ్యం బారిన పడినట్లు విద్యార్థులు తెలిపారు. దాంతో వీలైనంత త్వరగా గుర్తించి కాపాడాలని అధికారులకు తెలిపారు.ఇది కూడా చదవండి: చలికాలంలో తక్కువ నీరు తాగుతున్నారా..? డీహైడ్రేషన్ లక్షణాలు ఇవే