/rtv/media/media_files/2025/10/06/mahabubnagar-crime-news-2025-10-06-12-27-06.jpg)
Mahabubnagar Crime News
వనపర్తి జిల్లా రెవల్లి మండలంలోని నాగపూర్ గ్రామంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో నిత్యం గొడవలు, వేధింపులకు గురిచేస్తోందనే ఆగ్రహంతో కోడలు తన వృద్ధ అత్తను కర్రతో కొట్టి చంపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగపూర్ గ్రామానికి చెందిన ఎల్ల్లమ్మ (73), దాసయ్య దంపతులకు నలుగురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. భర్త దాసయ్య కొన్ని సంవత్సరాల క్రితం మరణించగా, ఎల్లమ్మ తన కుమారుడు మల్లయ్యతో కలిసి నివసిస్తోంది. అయితే ఎల్లమ్మకు, ఆమె కోడలు బోగురమ్మకు మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బోగురమ్మ తీవ్ర ఆగ్రహానికి లోనైంది. అత్త ఎల్లమ్మను కర్రతో విచక్షణారహితంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
అత్తను కర్రతో కొట్టి చంపిన కోడలు..
ఇది కూడా చదవండి: కవలలకు జన్మనిచ్చి బాలింత మృతి.. శవానికి ట్రీట్మెంట్ చేసిన ఏపీ డాక్టర్లు.. దారుణ ఘటన!
స్థానికులు ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం అందించగా.. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. అత్త నిత్యం వేధింపులకు గురిచేయడం వల్లే చంపినట్లు బోగురమ్మ పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించింది. మృతురాలు ఎల్లమ్మ రెండో కూతురు బచ్చమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రెవల్లి ఎస్ఐ రాజిత తెలిపారు. ఈ దారుణ సంఘటన నాగపూర్ గ్రామంలో కలకలం రేపింది.
ఇది కూడా చదవండి: హైదరాబాద్ రెస్టారెంట్‌లో ఫుడ్ పాయిజన్.. 8 మందికి సీరియస్!