AP Crime: కవలలకు జన్మనిచ్చి బాలింత మృతి.. శవానికి ట్రీట్మెంట్ చేసిన ఏపీ డాక్టర్లు.. దారుణ ఘటన!

కాకినాడ జిల్లా తునిలో వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మరణిచింది. మృతురాలు టి-తిమ్మాపురం గ్రామానికి చెందిన రత్నకుమారిగా గుర్తింపు. వైద్యులు, నర్సులు పట్టించుకోలేదని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

New Update
Kakinada Tuni Crime News

Kakinada Tuni Crime News

కాకినాడ జిల్లా తుని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాలింత మరణించడం తీవ్ర విషాదాన్ని, ఆందోళనను సృష్టించింది. టి-తిమ్మాపురం గ్రామానికి చెందిన గర్భిణి రత్నకుమారి డెలివరీ కోసం శుక్రవారం ఆసుపత్రికి వచ్చింది. నిన్న ఉదయం ఆమె ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చింది. అయితే డెలివరీ అయిన తర్వాత రత్నకుమారికి ఎక్కువగా బ్లీడింగ్ అవుతున్నా... వైద్యులు, నర్సులు పట్టించుకోలేదని మృతురాలి కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.

వైద్యుల నిర్లక్ష్యమే కారణంతో..

బ్లీడింగ్ అవుతుందని ఎన్నిసార్లు చెప్పినా డాక్టర్లు, సిబ్బంది వినలేదు. వారి నిర్లక్ష్యం వల్లే మా తమ్ముడి భార్య చనిపోయిందని మృతురాలి బావ ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి విషమించడంతో.. నిన్న మధ్యాహ్నం కాకినాడకు వెళ్లాలని వైద్యులు చెప్పి.. అంబులెన్స్‌లో పంపించారని బంధువులు తెలిపారు. కాకినాడ వెళ్లే దారిలో బాలింత అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో తిరిగి తుని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ డాక్టర్లు చనిపోయిన వ్యక్తికి చికిత్స చేస్తున్నట్టుగా నటించారని బంధువులు ఆరోపిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: విజయవాడలో సైకో.. దసరా ముందు మటన్ కత్తితో పిన్నిని ముక్కలు ముక్కలుగా

ఈ దారుణంపై ఆసుపత్రి దగ్గర బంధువులు ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లు, సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ కవల పిల్లలకు తల్లిలేని లోటు ఎవరు తీరుస్తారు.? ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని మృతురాలి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

ఇది కూడా చదవండి: వీడు కొడుకు కాదు రాక్షసుడు.. కన్నతల్లిని గొంతు కోసి చంపి.. శవాన్ని ఏం చేశాడంటే?

Advertisment
తాజా కథనాలు